దిల్లీ: భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగనున్న ద్వైపాక్షిక సిరీస్‌లో బీసీసీఐ స్వల్ప మార్పులు చేసింది. సవరించిన షెడ్యూల్ ప్రకారం.. తొలుత టీ20 సిరీస్, అది ముగిసిన తర్వాత టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇంతకు ముందు, మొదట టెస్టు, ఆ తర్వాత టీ20 సిరీస్‌ను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా సిరీస్‌ల నిర్వహణలో స్వల్ప మార్పులు చేస్తూ బీసీసీఐ షెడ్యూల్‌ను విడుదల చేసింది. రెండు జట్ల మధ్య ఫిబ్రవరి 24-27 వరకు టీ20 సిరీస్, మార్చి 4-16 వరకు టెస్టు సిరీస్ జరగనుంది. తొలి టీ20 లఖ్‌నవూలో, రెండు, మూడో టీ20 మ్యాచులు ధర్మశాలలో జరగనున్నాయి. తొలి టెస్టు మొహాలీలో, రెండో డే నైట్ మ్యాచ్ బెంగళూరులో జరగనుంది. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్ ముగిసిన వెంటనే.. శ్రీలంకతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.