Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

మహిళల ఐపీఎల్‌ వేలం
స్మృతికి జాక్‌పాట్‌

. రూ.3.4కోట్లకు సొంతం చేసుకున్న ఆర్‌సీబీ
. రూ.1.8 కోట్లు పలికిక హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

ముంబై: ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్‌) అరంగేట్ర సీజన్‌కు సంబంధించిన వేలంలో మహిళా క్రికెటర్ల పంట పండిరది. ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్ల వర్షం కురిపించాయి. ముంబైలోని జియో కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా జరుగుతున్న వేలంలో తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎంతకైనా తెగిస్తున్నారు. భారత వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన రూ.3 కోట్ల 40 లక్షల రూపాయలు పలకగా.. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రూ.1.8 కోట్లు దక్కించుకుంది. టీమిండియా ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ రూ.2.6 కోట్లు పలికింది. వేలంలో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లకు జాక్‌ పాట్‌ ధర లభిస్తోంది. బిగ్‌బాష్‌ లీగ్‌ ఆడిన అనుభవం ఉండటంతో ఆస్ట్రేలియా ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి. స్మృతి మంధానను రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్‌సీబీ)రూ.3.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇదే అత్యధిక ధర కాగా.. ఆస్ట్రేలియా ప్లేయర్‌ నాట్‌ సివర్‌ రూ.3.2 కోట్లకు ముంబై ఇండియన్స్‌ తీసుకోగా.. అష్లే గ్రహమ్‌ను గుజరాత్‌ జెయింట్స్‌ రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది. దీప్తి శర్మను రూ.2.6 కోట్లకు యూపీ ఫ్రాంచైజీ తీసుకుంది. వేలం నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు దగ్గర రూ.12 కోట్ల పర్స్‌ మనీ ఉండగా.. ఒక్కో జట్టు గరిష్టంగా 18 మంది.. కనిష్టంగా 15 మందిని కొనుగోలు చేయాలి. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే ఉండాలి. డబ్ల్యూపీఎల్‌ను మార్చి 4 నుంచి 26 వరకు నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఐదు జట్ల మధ్య మొత్తం 22 మ్యాచ్‌లు ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం, బ్రాబౌర్న్‌ స్టేడియం వేదికలుగా జరుగుతాయని పేర్కొంది. ఐపీఎల్‌ తరహాలో రాత్రి 7 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. డబుల్‌ హెడర్‌ ఉన్నప్పుడు మధ్యాహ్నం 3.30 గంటలకు మొదటి మ్యాచ్‌ జరగనుంది.

అత్యధిక ధర పలికిన ప్లేయర్లు

స్మృతి మంధానా (ఆర్‌సీబీ) రూ.3.4 కోట్లు
నాట్‌ సివర్‌ (ముంబై) రూ.3.2 కోట్లు
అష్లే గార్డనర్‌ (గుజరాత్‌ జెయింట్స్‌) రూ.3.2 కోట్లు
దీప్తి శర్మ (యూపీ) రూ.2.6 కోట్ల
జెమీమా రోడ్రిగ్స్‌ (ఢల్లీి క్యాపిటల్స్‌) రూ.2.2 కోట్లు
షెఫాలీ వర్మ (ఢల్లీి క్యాపిటల్స్‌) రూ.2 కోట్లు
బెత్‌ మూనీ (గుజరాత్‌) రూ.2 కోట్లు
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(ముంబై) రూ.1.8 కోట్లు
ఎక్లెస్టోన్‌(యూపీ) రూ.1.8 కోట్లు
తహిళా మెక్‌గ్రాత్‌(యూపీ) 1.4 కోట్లు
రేణుక సింగ్‌ (ఆర్‌సీబీ) రూ.1.5 కోట్లు
ఎల్లిస్‌ పెర్రీ(ఆర్‌సీబీ) రూ.1.7 కోట్లు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img