Friday, December 9, 2022
Friday, December 9, 2022

మీరాబాయిచానుకు ‘ఐనాక్స్‌’ బంపర్‌ ఆఫర్‌


న్యూదిల్లీ : టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుచుకున్న వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చానుకు మరో బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌ మూవీచైన్‌ సంస్థ ఆమెకు జీవితాంతం మూవీ టికెట్లు ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్‌ మీరాకు మాత్రమే కాక ఈ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ప్రతి అథ్లెట్‌కు వర్తిస్తుందని ఐనాక్స్‌ పేర్కొంది. అలాగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లంందరికీ ఒక ఏడాది పాటు ఈ ఆఫర్‌ వర్తింపజేస్తామని ట్విట్టర్‌ ద్వారా ఐనాక్స్‌ వెల్లడిరచింది. డొమినోస్‌ పిజ్జా సంస్థ కూడా మీరాబాయికి జీవితాంతం ఉచితంగా పిజ్జాలు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఇక ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించి విశ్వవేదికపై భారతీయ జెండాను రెపరెపలాడిరచిన మీరాబాయిపై కానుకల వర్షం కురుస్తోంది. ఇప్పటికే భారత రైల్వేశాఖ రూ.2కోట్ల నగదు బహుమతి ప్రకటించగా, మణిపూర్‌ ప్రభుత్వం కూడా కోటి రూపాయల నగదు ప్రోత్సాహకం అందజేసింది

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img