Friday, March 24, 2023
Friday, March 24, 2023

ముంబైలో నేడు తొలి వన్డే

ముంబై: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే రెండు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేశాయి. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో విజయం సాధించాలన్న లక్ష్యంతో అటు ఆసీస్‌… ఇటు టీమిండియా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి. కాగా టీమిండియా తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. రోహిత్‌ శర్మ గైర్హాజరీలో హార్దిక్‌పాండ్యా జట్టు సారథ్య బాధ్యతలను తీసుకోబోతున్నాడు. దాదాపు 7 నెలల తర్వాత జడేజా మళ్లీ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. ఆసీస్‌తో తొలి వన్డేకు టీమిండియా 5 మంది బ్యాట్స్‌మెన్లు, 3 ఆల్‌రౌండర్లు, ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లు, ఒక స్పెషలిస్ట్‌ స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. టీమిండియా ఓపెనింగ్‌ బాధ్యతలు శుభ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌… మూడో స్థానాన్ని విరాట్‌ కోహ్లీ, నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ బరిలోకి దిగుతారు. ఇక ఫినిషర్‌గా కేఎల్‌ రాహుల్‌ను ఆడిరచే అవకాశం ఉంది. బౌలింగ్‌ విభాగానికి వస్తే… భారత జట్టులో ముగ్గురు ఆల్‌ రౌండర్ల పాత్రలను కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ పోషించనున్నారు. అదే సమయంలో ఫాస్ట్‌ బౌలింగ్‌ బాధ్యత మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌లపై పడుతుంది. కుల్దీప్‌ యాదవ్‌ స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా రంగంలోకి దిగే అవకాశం ఉంది.
భారత్‌ తుది జట్టు (అంచనా): శుభ్‌ మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, మహ్మద్‌ షమీ, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌
ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా): ట్రావిస్‌ హెడ్‌, డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబూషేన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, కామెరాన్‌ గ్రీన్‌, మిచెల్‌ మార్ష్‌/మార్కస్‌ స్టోయినిస్‌, అలెక్స్‌ కారీ, సీన్‌ అబాట్‌, ఆడమ్‌ జంపా, మిచెల్‌ స్టార్క్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img