Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

యూఎస్‌ ఓపెన్‌ విజేత మెద్వెదెవ్‌

జకోవిచ్‌పై సంచలన విజయం

న్యూయార్క్‌ : యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ను రష్యన్‌ ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌ గెలుచుకున్నాడు. ఫైనల్‌ పోరులో ప్రపంచ నం.1 సెర్బియా ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌పై 6-4, 6-4, 6-4 తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించాడు. తన కేరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించాడు. దీంతో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు జకోవిచ్‌ ఇంకొన్ని రోజులపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి ఎదురైంది. ఇప్పటికే జకోవిచ్‌ 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లతో రోజర్‌ ఫెదరం, నాదల్‌ సరసన చేరాడు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టెన్నిస్‌ చరిత్రలో కొత్త అధ్యయాన్ని లిఖిద్దామనకున్న జకోకు నిరాశే ఎదురైంది. న్యూయార్క్‌ సిటీలోని ఆర్థర్‌ ఆషే స్టేడియంలో అభిమానుల కోలాహాలం మధ్య, అత్యంత ఉత్కంఠగా ఈ మ్యాచ్‌ ప్రారంభమైంది. ఆట ప్రారంభమైనప్పటి నుంచి ఇద్దరు ఆటగాళ్లు నువ్వానేనా అన్నట్లు ఆడారు. తొలిసెట్‌లో 6-4 తేడాతో మెద్వెదెవ్‌దే పైచేయి సాధించినప్పటికీ రెండో సెట్‌లో ఇద్దరు ఆటగాళ్లు బలమైన షాట్లు, సర్వీస్‌ బ్రేక్‌లతో ఆటను ఉత్కంఠ స్థితికి తీసుకొచ్చారు. అయితే జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా 25 ఏళ్ల మెద్వెదెవ్‌ 6-4 తేడాతో రెండో సెట్‌ను కూడా గెలిచాడు. ఇక నిర్ణయాత్మక మూడో సెట్‌లో సెర్బియా యోధుడు జకోవిచ్‌ మొదట తేలిపోయినప్పటికీ తర్వాత పుంజుకున్నాడు. అయినప్పటికీ మెద్వెదెవ్‌ విజయాన్ని జకో అడ్డుకోలేపోయాడు. దీంతో హోరాహోరీగా సాగిన ఈ సెట్‌లో మెద్వెదెవ్‌ 6-4 తేడాతో గెలిచాడు. దీంతో డానిల్‌ మెద్వెదెవ్‌ మూడో సెట్‌ను గెలిచి టెన్నిస్‌ చరిత్రలో తన కొత్త పేజీని ప్రారంభించాడు.2019లో యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరి ఓటమి పాలైన ఇతడు ఇప్పుడు టైటిల్‌ గెలిచి రేసులోకి వచ్చాడు.
ఒత్తిడికి గురయ్యా : జకోవిచ్‌
ఓటమిని తట్టుకోలేని జకోవిచ్‌.. తన రాకెట్‌ను నేలకేసి కొట్టి కన్నీటి పర్యంతమయ్యాడు. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒత్తిడికి గురవ్వడం వల్లే ఓటమి చెందానని జకోవిచ్‌ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img