అర్ధసెంచరీ మిస్
పర్వాలేదనిపించిన విలియమ్సన్
బెంగళూరు లక్ష్యం 142
హర్షల్‌కు 3 వికెట్లు
అబుదాబి : ఐపీఎల్ 14వ సీజన్‌లో బుధవారం మ్యాచ్‌పైనే అందరి కళ్లు ఉన్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు…. పరాజయాల బాటలో శరవేగంగా వెళుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో పోటీ పడ్డాయి. 12 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు పొందిన ఆర్సీబీ ప్లేఆఫ్‌కు వెళ్లగా, పాయింట్ల పట్టికలో చివర్లో నిలిచిన సన్‌రైజర్స్ ఎప్పుడో ప్లేఆఫ్ నుంచి వైదొలగింది. ఈ నేపథ్యంలో బుధవారం మ్యాచ్ ఆసక్తిగా సాగింది.
ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది. జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. సన్‌రైజర్స్ కూడా తన జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. ఇక టాస్ ఓడిన సన్‌రైజర్స్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, జాసన్ రాయ్‌లు ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు.
మొదట్లో ఆచితూచి ఆడసాగారు. ఈ క్రమంలోనే అభిషేక్ ఫోర్స్, సిక్స్‌లో ఒక్కసారిగా వేగం పెంచాడు. ఈక్రమంలోనే డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్‌లెగ్‌లో ఉన్న సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్ రాయ్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి నెమ్మదిగా స్కోరు బోర్డు వేగం పెంచారు. ధాటిగా ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ (31, 29 బంతులు, 4I4)ను హర్షల్ పటేల్ ఔట్ చేశాడు. అబ్దుల్ సమద్ కూడా కేవలం ఒక పరుగుకే పరిమితమై పెవిలియన్ బాట పట్టాడు. తరువాత క్రీజులోకి వచ్చిన ప్రియం గార్గ్‌కూడా ధాటిగానే ఇన్నింగ్స్‌ను మొదలు పెట్టాడు.
గార్గ్ (15, 11 బంతులు, 1I6) కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. అతడిని క్రిస్టియన్ పెవిలియన్‌కు పంపాడు. మరికొద్దిసేపటికి ఓపెనర్ జాసన్ రాయ్ కూడా సహనం కోల్పోయి అర్థసెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. 38 బంతుల్లో 4I5తో 44 పరుగులు చేసిన రాయ్ క్రిస్టియన్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తరువాత కీపర్ వృద్ధిమాన్ సాహా (10) క్రీజులోకి వచ్చి కొంచెంసేపు ప్రతిఘటించాడు. అనంతరం హర్షల్‌పటేల్ బౌలింగ్‌లో డివిలియర్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జాసన్ హోల్డర్ కొద్దిసేపు బెంగళూరు బౌలర్లను ఎదుర్కొన్నాడు. హోల్డర్‌కు రషీద్ ఖాన్ తోడై కొన్ని పరుగులు సాధించాడు.
మరికొద్దిసేపటికి హోల్డర్ కూడా ఔటవడంతో నిర్ణీత 20 ఓవర్లలో సన్‌రైజర్స్ 141 పరుగులు చేసింది. బెంగళూరు బౌలింగ్‌లో హర్షల్ పటేల్‌కు 3, డానియన్ క్రిస్టియన్‌కు 2, చహల్, గార్టన్‌కు చెరో వికెట్ దక్కాయి.