Friday, March 31, 2023
Friday, March 31, 2023

రోహిత్‌ సేనకు ఘోర పరాభవం

. 9 వికెట్లతో ఓటమి చవిచూసిన టీమిండియా
. చేజారిన మూడో టెస్టు
. సమష్టిగా రాణించిన ఆసిస్‌

ఇండోర్‌: ఆస్ట్రేలియాతో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీలో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా తొలి రెండు టెస్టుల్లో భారీ విజయాలు నమోదు చేసిన రోహిత్‌ సేన.. మూడో టెస్టులో మాత్రం ఆ జోరు కొనసాగించలేకపోయింది. పేలవ బ్యాటింగ్‌తో 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే తొలి రెండు టెస్ట్‌ల్లో ఆసీస్‌ కనీస పోటీ ఇవ్వకపోవడంతో ఆ జట్టును టీమిండియా లైట్‌ తీస్కోంది. విజయ గర్వంతో తప్పిదాలను సరిదిద్దుకోకుండానే ఇండోర్‌ టెస్ట్‌ బరిలోకి దిగి మూల్యం చెల్లించుకుంది. దిల్లీ టెస్ట్‌ మూడు రోజుల్లోనే ముగియడంతో భారత ఆటగాళ్లు స్వస్థలాలకు వెళ్లారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చినట్లు బీసీసీఐ ప్రకటించింది.
ప్రతీకారంతో రగిలిపోయి
ఆస్ట్రేలియా మాత్రం పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. ఛాంపియన్‌ టీమ్‌ అయిన తాము భారత్‌లో గెలవకపోవడం ఏంటని ప్రశ్నిం చుకుంది. తొలి రెండు టెస్ట్‌ల్లో చేసిన తప్పిదాలపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టింది. ఫీల్డింగ్‌ తప్పిదాలతో పాటు ఇండోర్‌లో స్పిన్‌ పిచ్‌ ఉంటుందని ముందే ఊహించి దానికి తగ్గట్లు సిద్దమైంది. ఫీల్డింగ్‌ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి రేకు డబ్బాలు, పిచ్‌ రోలర్‌, బేస్‌ బాల్‌ బ్యాట్‌తో ప్రాక్టీస్‌ చేసింది. ఈ కష్టం ఆసీస్‌కు ఫలితాన్ని ఇచ్చింది. తొలి రెండు టెస్ట్‌ల్లో కీలక క్యాచ్‌లు వదిలేసి మూల్యం చెల్లించు కున్న ఆసీస్‌.. ఇండోర్‌ టెస్ట్‌లో ఒక్క క్యాచ్‌ను కూడా నేలపాలు చేయలేదు. పైగా రెండు అత్యద్భుతమైన క్యాచ్‌లతో మ్యాచ్‌ను తమవైపు తిప్పుకుంది.
పకడ్బందీ ప్రణాళికలతో
భారత బ్యాటర్లు ఆడే విధానాన్ని నిశితంగా పరిశీలించిన ఆసీస్‌.. వారికి తగ్గట్లు వ్యూహరచన చేసింది. ప్రతీ బ్యాటర్‌ వీక్‌నెస్‌ తెలుసుకొని అందుకనుగుణంగా బౌలింగ్‌ చేసి ఫలితాన్ని రాబట్టింది. పిచ్‌ కూడా సహకరించడంతో చెలరేగి పోయింది. తొలి టెస్ట్‌లో సెంచరీతో జట్టుకు విజయాన్నందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. టెంప్ట్‌ చేసి ఔట్‌ చేసింది. విరాట్‌ కోహ్లి బలహీనతపై దెబ్బ కొట్టి పెవిలియన్‌ చేర్చింది. తొలి రెండు టెస్ట్‌ల్లో లోయర్‌ ఆర్డర్‌లో కీలక భాగస్వామ్యాలు నమోదు చేసిన రవీంద్ర జడేజా, అశ్విన్‌, అక్షర్‌లను తమ బౌలింగ్‌తో కట్టడి చేసింది.
స్పిన్‌ ఉచ్చులోనే బిగించి
బ్యాటింగ్‌లోనూ భారత స్పిన్‌ను సమర్థ వంతంగా ఎదు ర్కొంది. అటాకింగ్‌ గేమ్‌తో భారత బౌలర్లపై ఒత్తిడిని పెంచింది. తొలి ఇన్నింగ్స్‌ చివర్లో తడబడినా.. పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ భారత్‌ను ఒత్తిడిలో ఉంచింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యూహాత్మక తప్పిదాలు కూడా ఆసీస్‌కు కలిసొచ్చాయి. ముఖ్యం గా ఆసీస్‌ను స్మిత్‌ నడిపించడం ఆ జట్టు విజయానికి ప్రధాన కారణమైంది. కమిన్స్‌ తప్పిదాలను పునరా వృతం చేయకుండా స్మిత్‌ కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు. తన వ్యూహాలు.. పరిస్థితులకు తగ్గట్లు తీసుకున్న నిర్ణయాలు అతను ఎంత గొప్ప కెప్టెనో అనే విషయాన్ని స్పష్టం చేశాయి.
స్మార్ట్‌ సారథ్యంతో
ఏ దశలోనూ భారత బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. శ్రేయస్‌ అయ్యర్‌ స్పిన్నర్లను సమర్థవంతంగా ఆడుతుండటంతో వెంటనే మిచెల్‌ స్టార్క్‌ను దింపి అతని జోరుకు బ్రేక్‌ వేసిన విధానం స్మిత్‌ సారథ్య ప్రతిభను తెలియజేస్తోంది. ఫీల్డ్‌ ప్లేస్‌మెంట్స్‌ కూడా అద్బుతం. ఉమేశ్‌ యాద వ్‌ను ఊరించే బంతితో పెవిలియన్‌కు చేర్చడం దీనికి నిదర్శనం. కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ విఫల మైతే.. స్మిత్‌ తన సారథ్యంతో జట్టును గెలిపించాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img