ముంబై: ప్రపంచ క్రికెట్‌లో వెస్టిండీస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. వన్డే ప్రపంచకప్‌కు అర్హత కోల్పోయింది. 1975, 1979లో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్ సాధించిన వెస్టిండీస్.. తాజాగా వన్డే ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించలేని జట్టుగా నిలిచిపోయింది. శనివారం జరిగిన సూపర్ సిక్స్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌పై 7 వికెట్ల తేడాతో ఓటమిపాలవ్వడంతో వన్డే ప్రపంచకప్‌లో ఆడే అవకాశాన్ని వెస్టిండీస్ కోల్పో యింది. 48 ఏళ్లలో వన్డే ప్రపంచకప్‌కు వెస్టిండీస్ అర్హత సాధించకపోవడం ఇదే తొలిసారి. స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 43.5 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌటయ్యింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ప్రత్యర్థి 42.3 ఓవర్లలో మరో 7 వికెట్లు మిగిలుండగానే విజయం సాధించింది.