భారత అగ్రశ్రేణి బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు టోక్యోలో దూసుకుపోతోంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా గురువారం డెన్మార్క్ షట్లర్ బ్లిక్‌ఫెల్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి స్థాయిలో ఆధిపత్యం చెలాయించిన పీవీ సింధు 21-15, 21-13 రూపంలో వరుస సెట్లలో విజయం సాధించింది.