Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

షమీ`అశ్విన్‌`జడేజా షో

. ఆసిస్‌ మొదటి ఇన్నింగ్స్‌ 263
. టీమిండియా ప్రస్తుతం 21/0
. రాణించిన బౌలర్లు
. ఇక బ్యాట్స్‌మెన్‌దే భారం

న్యూదిల్లీ: బోర్డర్‌-గవస్కర్‌ ట్రోఫీ రెండో టెస్టులో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు పోటాపోటీగా తలపడు తున్నాయి. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 9 ఓవర్లలో వికెట్‌ నష్ట పోకుండా 21 పరుగులు చేసింది. క్రీజ్‌లో రోహిత్‌ శర్మ (13 నాటౌట్‌), కేఎల్‌ రాహుల్‌ (4 నాటౌట్‌) ఉన్నారు. అంతకుముందు ఆసీస్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకు ఆలౌటైంది. తొలుత మహమ్మద్‌ షమీ (4/60) వికెట్ల వేటను ప్రారం భించగా.. రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/57), రవీంద్ర జడేజా (3/68) మిగతా బ్యాటర్ల సంగతి తేల్చారు. విరామాల్లో వికెట్లు తీస్తూ ఆసీస్‌ను ఆలౌట్‌ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఉస్మాన్‌ ఖవాజా (81), పీటర్‌ హ్యాండ్స్‌కాంబ్‌ (72 నాటౌట్‌) అర్ధశతకాలు సాధిం చగా.. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (33) కాస్త ఫర్వాలేదనిపించాడు.
వార్నర్‌ మరోసారి విఫలం: తొలి టెస్టులో ఘోర పరాభవం తర్వాత ఆసీస్‌ బ్యాటింగ్‌లో మార్పులు వస్తా యని ఆ జట్టు అభిమానులు ఆశించారు. అందుకు తగ్గట్టే టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆసీస్‌కు శుభారంభమే దక్కింది. ఉస్మాన్‌ ఖవాజా (81, 125 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌)తో కలిసి ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ (15) మొదటి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం జోడిరచాడు. ఆరంభం నుంచి అతి జాగ్రత్తగా ఆడిన వార్నర్‌ను షమీ బోల్తా కొట్టించాడు. షమీ బౌలింగ్‌లో బంతిని కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ చేతిలోకి పంపించిన వార్నర్‌ పెవిలి యన్‌కు చేరాడు. అయితే మార్నస్‌ లబుషేన్‌ (18)తో కలిసి ఖవాజా ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు.
అశ్విన్‌ హవా.. జడ్డూ మాయ.. మధ్యలో షమీ: లబుషేన్‌-ఖవాజా జోడీ రెండో వికెట్‌కు 41 పరుగుల జోడిరచారు. అయితే కేవలం మూడు బంతుల వ్యవధిలోనే కీలకమైన లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌ (0) వికెట్లను తీసిన అశ్విన్‌ భారత్‌ను రేసులోకి తెచ్చాడు. ఆసీస్‌ ఎన్నో ఆశలు పెట్టుకొన్న ట్రావిస్‌ హెడ్‌ (12) కూడా నిరాశపరిచాడు. అయితే హ్యాండ్స్‌కాంబ్‌ (67)తో కలిసి ఖవాజా మరోసారి కీలకమైన అర్ధశతక (59) భాగస్వామ్యం నిర్మించాడు. ఈ క్రమంలో జడేజా బౌలింగ్‌లో రాహుల్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టడంతో ఖవాజా పెవిలియన్‌కు చేరక తప్పలేదు. కానీ, చివర్లో హ్యాండ్స్‌ కాంబ్‌ మొండిగా బ్యాటింగ్‌ చేశాడు. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ (33) దూకుడుగానే ఆడాడు. హ్యాండ్స్‌ కాంబ్‌ ను మినహాయించి మిగతా లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లను జడేజా, షమీ ఔట్‌ చేయడంతో ఆసీస్‌ కథ ముగిసింది.
‘స్పిన్‌ ద్వయం’ ఖాతాలోకి రికార్డులు: భారత టాప్‌ స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా రికార్డులు సృష్టించారు. అలాగే సీనియర్‌ బ్యాటర్‌ ఛెతేశ్వర్‌ పుజారా కూడా అరుదైన ఘనత సాధించాడు. తొలుత వికెట్ల వేట ప్రారంభించిన అశ్విన్‌ ప్రస్తుతం టీ బ్రేక్‌ సమ యానికి కీలకమైన మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్‌పై వంద వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించగా.. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌తో కలిపి 700 వికెట్లను పూర్తి చేసిన బౌలర్‌గా అవతరించాడు. అదేవిధంగా ఆసీస్‌ బ్యాటర్‌ స్టీవ్‌ స్మిత్‌ను రెండుసార్లు డకౌట్‌ చేసిన ఏకైక బౌలర్‌ కూడా అశ్విన్‌ కావడం విశేషం. 2011లో దిల్లీలోనే టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన అశ్విన్‌ ఇప్పటి వరకు తొమ్మిది ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌లను సొంతం చేసుకొన్నాడు. ఇంకో మూడు తీసుకొంటే మురళీధరన్‌ (11) రికార్డును అధిగమి స్తాడు. ప్రస్తుతం టెస్టుల్లో అశ్విన్‌ 460 వికెట్లతో కొనసాగుతున్నాడు. మరో రెండు వికెట్లు పడగొడితే ఆసీస్‌ బౌలర్‌ నాథన్‌ లైయన్‌ (461)ను అధిగమించి టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఎనిమిదో బౌలర్‌గా అవతరిస్తాడు.
జడ్డూ భాయ్‌ ఖాతాలోనూ..: ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో ఇప్పటి వరకు రవీంద్ర జడేజా కూడా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు. కీలకమైన ఉస్మాన్‌ ఖవాజా వికెట్‌ను తీసిన జడేజా టెస్టుల్లో 250 వికెట్లు తీసిన బౌలర్‌గా మారాడు. అలాగే టెస్టు ఫార్మాట్‌లో 2500కిపైగా పరుగులు, 250 వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించాడు. మరోవైపు వంద టెస్టుల క్లబ్‌లోకి ఛెతేశ్వర్‌ పుజారా వచ్చేశాడు. ఈ సందర్భంగా సునిల్‌ గావస్కర్‌ చేతులమీదుగా ప్రత్యేకమైన క్యాప్‌ను స్వీకరించడం విశేషం. వందో టెస్టులో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్‌ ఆడాలని అభిమానులు ఆశిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img