Friday, December 9, 2022
Friday, December 9, 2022

షూటింగ్‌లో అదరగొట్టిన సౌరభ్‌

ఫైనల్స్‌కు దూసుకెళ్లిన భారత యువ షూటర్‌
ఒలింపిక్స్‌లో భారత యువ షుటర్‌ సౌరభ్‌ చౌదరీ 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ షూటింగ్‌లో దుమ్మురేపాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో సౌరభ్‌ మొత్తం 586 పాయింట్లతో ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. మొత్తం ఆరు రౌండ్లలో సౌరభ్‌ వరుసగా 95, 98, 98, 100, 98, 97 పాయింట్లు సాధించాడు. మొత్తం 36 మంది పోటీపడగా.. సౌరభ్‌ 586 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అతని సహచరుడు అభిషేక్‌ వర్మ 575 పాయింట్లతో 17వ స్థానానికి పరిమితం అయ్యాడు.దీంతో ఆయన ఈ పోటీల నుంచి నిష్క్రమించాడు. ఇక ఫైనల్స్‌ చేరిన సౌరభ్‌ అక్కడ కూడా ఇదే దూకుడు కనబరిస్తే భారత్‌ ఖాతాలో పతకం చేరడం ఖాయం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img