బెంగళూరు: ఐపీఎల్‌లో తొలిసారి శతకం బాదిన శుభ్‌మన్ గిల్‌పై విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. వచ్చే తరాన్ని గిల్ ఏలుతాడని అతను తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో తెలిపాడు. కెరీర్‌లోనే సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ సెంచరీ హీరోను అభినందిస్తూ కోహ్లీ ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు. ‘టాలెంట్ అనగానే శుభ్‌మన్ గిల్ గుర్తుకొస్తాడు. వెళ్లు వచ్చే తరాన్ని ఏలు. దేవుడి కృప నీపై ఎల్లప్పుడూ ఉంటుంది’ అని అందులో విరాట్ రాసుకొచ్చాడు. దాంతో, ఏడేళ్ల క్రితం వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. 2016లో కోహ్లీతో ఉన్న ఆ ఫొటోకు గిల్ ‘నా ఆరాధ్య క్రికెటర్’తో అనే క్యాప్షన్ రాశాడు. ఈ సీజన్‌లో దుమ్మురేపుతున్న గిల్ సోమవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై జరిగిన మ్యాచ్‌లో సెంచరీ కొట్టాడు. దాంతో, ఒకే ఏడాది అన్ని ఫార్మాట్లతో పాటు ఐపీఎల్‌లోనూ శతకం బాదిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.
భీకర ఫామ్‌లో గిల్: ఈ ఏడాది శుభ్‌మన్ గిల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. స్వదేశంలో శ్రీలంకపై వన్డేల్లో రెండొందలు కొట్టిన అతను టీ20ల్లోనూ చెలరేగాడు. న్యూజిలండ్‌పై శతకం సాధించాడు. దాంతో, అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించాడు. అంతేకాదు ఐపీఎల్ 16వ సీజన్‌లో వృద్ధిమాన్ సాహాతో కలిసి డిఫెండిరగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు శుభారంభాలు ఇస్తున్నాడు. గుజరాత్ ప్లే ఆఫ్స్ చేరడంలో ఈ యువ ఓపెనర్ కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్‌లో రెండు సార్లు వందకు చేరువగా వచ్చిన అతను ఈసారి కొట్టేశాడు.