Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

సెమీస్‌కు చేరిన సింధు

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఒలింపిక్స్‌లో విజయదుందుభి మోగిస్తూ సెమిస్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం జపాన్‌కు చెందిన 4సీడ్‌ క్రీడాకారిణి అకనే యమగుచితో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో వరుస సెట్లలో విజయం సాధించింది. తొలి నుంచి దూకుడు ప్రదర్శించిన సింధు 21-13, 22-20తో యమగుచిని మట్టి కరిపించి సెమీస్‌కు దూసుకెళ్లింది. దీంతో మరోసారి భారత్‌కు పతకం ఖాయం చేసేలా కనిపిస్తోంది. సింధు సెమీస్‌లో రేపు ప్రపంచ నంబర్‌ వన క్రీడాకారిణి అయిన తైవాన్‌కు టై టిజు యింగ్‌ లేదంటే, థాయిలాండ్‌కు చెందిన ప్రపంచ నంబర్‌ 6 క్రీడాకారిణి రచనోక్‌ ఇంటానాన్‌తో కానీ తలపడుతుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img