Friday, April 19, 2024
Friday, April 19, 2024

అంతర్జాతీయ క్రికెట్‌కు ఫించ్‌ వీడ్కోలు

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌ మెన్‌, టీ20 జట్టు కెప్టెన్‌ అరోన్‌ ఫించ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటిం చాడు. గతేడాది సెప్టెంబర్‌లో వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకున్న ఫించ్‌… ప్రస్తుతం టీ20లకు మాత్రమే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజాగా అన్ని ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి పలికాడు. ‘2024 టీ20 ప్రపంచకప్‌ వరకు నేను ఆడలేకపోవచ్చని అర్థమైంది. ఫిట్‌నెస్‌ సాధించలేకపో తున్నా. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమ యం అనిపించింది. వచ్చే ఏడాది మెగా టోర్నీ నాటికి జట్టును సమా యత్తం చేసేందుకు తగినంత సమయం ఉంటుంది. నాకు మద్దతుగా నిలిచిన వాళ్లందరికీ కృతజ్ఞతలు. తొలిసారి టీ20 ప్రపంచకప్‌ 2021, 2015లో సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్‌ అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేను’ అని ఫింట్‌ ట్వీట్‌ చేశాడు. ఫించ్‌ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 254 మ్యాచులు ఆడాడు. అందులో ఐదు టెస్టు సిసీస్‌లు కాగా, 146 వన్డేలు మ్యాచులు, 103 టీ20లు ఆడాడు. మొత్తంగా 8,804 పరుగులు చేశాడు. అందులో 19 సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో అత్యధిక స్కోరు ఫించ్‌ (172) పేరుమీదే ఉంది. 2014, 2018లో టీ20 ప్లేయర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ గా ఎంపికయ్యాడు. 2015 వన్డే వరల్డ్‌ కప్‌ను కూడా ముద్దాడాడు. ఇక, ఫించ్‌ సారథ్యంలో యూఏఈ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ 2021 టోర్నీలో విజయం సాధించి ఆస్ట్రేలియా జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img