Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అందుకే స్వర్ణం కోల్పోయా : తంగవేలు

న్యూదిల్లీ : గ్రౌండ్‌ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే తాను స్వర్ణం కోల్పోయినట్లు టోక్యో పారాలింపిక్స్‌ హైజంప్‌ టీ63 విభాగంలో రజత పతకం సాధించిన తమిళనాడు అథ్లెట్‌ మరియప్పన్‌ తంగవేలు తెలిపాడు. ‘‘ఈ పోటీలో స్వర్ణం సాధిస్తానని అనుకున్నా. కానీ, గ్రౌండ్‌ కండీషన్‌ అనుకూలించలేదు. పోటీ జరుగుతున్న సమయంలో వర్షం బాగా పడిరది. నా కాలికి ధరించిన సాక్సు పూర్తిగా తడిచిపోయింది. ఈ నేపథ్యంలో పోటీ కష్టంగా మారింది. జంప్‌ చేసే సమయంలో కాస్త ఇబ్బంది పడ్డా.’’ అని తంగవేలు పేర్కొన్నాడు. పరిస్థితులు అనుకూలించి ఉంటే.. 1.88 మీటర్ల ఎత్తు అలవోకగా ఛేదించేవాడని మరియప్పన్‌ కోచ్‌ ఆర్‌ సత్యనారాయణ అన్నాడు. మరియప్పన్‌ గతనెల ఎస్‌ఏఐ బెంగళూరులో 1.98 మీ, 2016 రియో ఒలిపింక్స్‌లో 1.89మీ ఎత్తుకు జంప్‌ చేశాడని గుర్తుచేశాడు. హైజంప్‌ టీ63 విభాగంలో అమెరికా అథ్లెట్‌ 1.88 మీటర్ల ఎత్తుతో స్వర్ణం సాధించగా.. తంగవేలు 1.86మీటర్లతో రజత పతకం సొంతం చేసుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో భారత అథ్లెట్‌ శరద్‌ కుమార్‌ కాంస్య పతకం దక్కించుకున్నాడు.
రూ. 2 కోట్ల నజరానా.: రజత పతకం సాధించిన తంగవేలుకు తమిళనాడు ప్రభుత్వం. భారీ నజరానా ప్రకటించింది. రూ. 2 కోట్లు బహుమతిగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వెల్లడిరచారు. తంగవేలు ప్రదర్శనకు దేశం గర్విస్తోందని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img