Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆదుకున్న జడ్డూ…!

భారత్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ 364
జడేజా అర్ధసెంచరీ మిస్‌
టెయిలెండర్లు విఫలం
ఆండర్సన్‌ పాంచ్‌ పటాకా
ఇంగ్లండ్‌ ప్రస్తుతం 41/2

లండన్‌: లార్డ్స్‌ వేదికగా భారత్‌, ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌ రెండో రోజులో భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌ ముగిసింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (40) పరుగులు చేశాడు. అం తకుముందు వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ 37 పరుగులు చేయగా.. పేసర్‌ మహ్మద్‌ షమీ (0) డకౌట్‌ అయ్యాడు. తొలి సెషన్‌ ఆదిలో ఇంగ్లండ్‌ ఆధిపత్యం చెలాయించగా.. చివరలో కోహ్లి సేన పట్టుబిగించింది. మొత్తానికి తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ పైచేయి సాధించింది. 276/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శుక్ర వారం భారత్‌ ఆట కొనసాగించింది. ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరు 127తో బ్యాటింగ్‌ కొనసాగించిన ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ (129: 250 బంతుల్లో 12I4, 1I6) మొదటి బంతికి రెండు పరుగులు తీసి.. రెండో బంతికి ఔటైపోయాడు. ఓలీ రాబిన్సన్‌ వేసిన రెండో బంతికి రాహుల్‌ కవర్‌ డ్రైవ్‌ ఆడాడు. కానీ షాట్‌ అతను ఆశించిన విధంగా కనెక్ట్‌ కాకపోవడంతో బంతి నేరుగా వెళ్లి ఫీల్డర్‌ డొమినిక్‌ సిబ్లే చేతుల్లో పడిరది. దీంతో భారత్‌ 278 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది. కేఎల్‌ రాహుల్‌ ఔట్‌ అయిన తర్వాతి ఓవర్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానే (1, 23 బంతుల్లో) పెవిలియన్‌ చేరాడు. ఆఫ్‌ స్టంప్‌కి వెలుపలగా వెళ ్తన్న బంతిని వెంటాడి స్లిప్‌లో జో రూట్‌ చేతికి చిక్కాడు. జేమ్స్‌ అండర్సన్‌ శుక్ర వారం ఆటలో వేసిన తొలి బంతికే రహానేని ఔట్‌ చేయడం గమనార్హం. గురువారం నాటి స్కోరుకి కనీసం ఒక పరుగు కూడా రహానే యాడ్‌ చేయలేకపోయాడు. అయితే రిషబ్‌ పంత్‌, రవీంద్ర జడేజాలు భారత ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఇద్దరు కలిసి దాదాపు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే పంత్‌ అనుకోకుండా మార్క్‌ వుడ్‌ బౌలింగ్‌లో కీపర్‌కు చిక్కడంతో భారత్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. మరుసటి ఓవర్‌లోనే మొహ్మద్‌ షమీ (0) సైతం మోయిన్‌ అలీ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఈ క్రమంలోనే జోడీ కట్టిన రవీంద్ర జడేజా, ఇషాంత్‌ శర్మ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు. 276/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్‌ మరో నాలుగు వికెట్లు కోల్పోయి భోజన విరామ సమయానికి 346/7 స్కోర్‌తో నిలిచింది. భోజన విరామం అనంతరం సెషన్‌ ప్రారంభించిన టీమిండియా మరికాసేపటికి ఇషాంత్‌ (8)ని అండర్సన్‌ దెబ్బతీశాడు. తరువాత బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రా, పెద్దగా ప్రభావం చూప లేకపోయాడు. ఈ లోపు మంచి ఊపులో ఉన్న జడేజా (40)ను మార్క్‌వుడ్‌ పెవిలియన్‌కు పంపాడు. దీంతో 364పరుగుల వద్ద భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో జేమ్స్‌ అండర్సన్‌ ఐదు వికెట్టు తీయగా, ఓలి రాబిన్‌సన్‌ రెండు, మార్క్‌ వుడ్‌ రెండు వికెట్లు పడగొట్టారు. మొయిన్‌ అలీకి ఒక వికెట్‌ దక్కింది.
అలీ అరుదైన రికార్డు
ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ మొయిన్‌ అలీ టీమిండియాపై టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌పై టెస్టుల్లో 50 వికెట్లు తీసిన ఆరో స్పిన్నర్‌గా మొయిన్‌ అలీ నిలిచాడు. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో షమీ వికెట్‌ తీయడం ద్వారా అలీ ఈ ఘనతను అందుకున్నాడు. కాగా భారత్‌పై టెస్టుల్లో మురళీధరన్‌(శ్రీలంక) 105 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. నాథన్‌ లియాన్‌ (ఆస్ట్రేలియా) 94 వికెట్లతో రెండో స్థానంలో, 63 వికెట్లతో లాన్స్‌ గిబ్స్‌(వెస్టిండీస్‌) మూడో స్థానంలో, అండర్‌వుడ్‌(ఇంగ్లండ్‌) 62 వికెట్లతో నాలుగు.. 52 వికెట్లతో బెనాడ్‌(ఆస్ట్రేలియా) ఐదో స్థానంలో ఉన్నాడు. తాజాగా ఈ జాబితాలో చేరిన మొయిన్‌ అలీ ఇంగ్లండ్‌ తరపున 62 టెస్టుల్లో 2831 పరు గులు.. 190 వికెట్లు, 112 వన్డేల్లో 1877 పరుగులు.. 87 వికెట్లు, 38 టీ20ల్లో 437 పరుగులు.. 21 వికెట్లు తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ ఆచితూచి ఆడసాగింది. వికెట్లు కోల్పోకుండా జాగ్రత్త పడిరది. అయితే టీ అనంతరం సిబ్లే (11), హసీబ్‌ హమీద్‌ (0) వికెట్లు కోల్పోయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img