Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆసీస్‌ మహిళల జట్టుకు రూ.8 కోట్లు


లండన్‌ : దక్షిణాఫ్రికాలో జరిగిన మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ 2023 చాంపియన్‌గా అవతరించిన ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌ జట్టు… రూ.8 కోట్లకు పైగా ప్రైజ్‌ మనీ గెల్చుకుంది. రెండోసారి వరుసగా మూడు సార్లు పొట్టి ప్రపంచకప్‌ గెలిచిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. విజేతగా నిలిచిన ఆసీస్‌ జట్టు దాదాపు ఒక మిలియన్‌ డాలర్లు. అంటే.. రూ. 8.3 కోట్లు, రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు రూ. 4.13 కోట్లు గెలుచుకుంది. ఇక ఈ టోర్న మెంట్‌లో సెమీఫైనల్‌కు చేరిన నాలుగు జట్లకు రూ.1.73 కోట్లు ఇస్తారు. ఇంగ్లండ్‌, భారత మహిళల జట్టుకు రూ.1.73 కోట్ల చొప్పున అందుతాయి. పోయిన ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన పురుషుల టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది. దాంతో, ఆ జట్టు రూ. 13.25 కోట్ల ప్రైజ్‌మనీ దక్కించుకుంది. రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్‌కు రూ. 6.6 కోట్లు బహుమతిగా లభించాయి. సెమీఫైనల్‌ చేరిన భారత్‌, న్యూజిలాండ్‌ జట్లకు రూ.3.25 కోట్లను ఐసీసీ ముట్టజెప్పింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో జోస్‌ బట్లర్‌ సారథ్యంలోని ఇంగ్లండ్‌ 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై గెలుపొందింది. కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో ఆదివారం జరిగిన మహిళల టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా 19 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. దాంతో, ఆ జట్టు ఆరోసారి సగర్వంగా పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడిరది. అత్యధిక ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన తొలి కెప్టెన్‌గా ఆ జట్టు కెప్టెన్‌ మేగ్‌ లానింగ్‌ చరిత్ర సృష్టించింది. లానింగ్‌ కెప్టెన్సీలో ఆసీస్‌ మహిళల జట్టు ఐదు సార్లు జగజ్జేతగా నిలిచింది. ఆస్ట్రేలియా మహిళల జట్టు 2014, 2018, 2020, 2023లో పొట్టి ప్రపంచకప్‌, 2023లో వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img