Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆసీస్‌ 480 ఆలౌట్‌

. గ్రీన్‌ సెంచరీ
. ఆరు వికెట్ల తీసిన అశ్విన్‌
. టీమిండియా స్కోరు 36/0

అహ్మదాబాద్‌: అనుకున్నట్లే జరిగింది… ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. తొలిరోజు సెంచరీ బాదిన ఉస్మాన్‌ ఖవాజా ద్విశతకానికి చేరువగా వెళ్లగా, మరో బ్యాటర్‌ గ్రీన్‌ కూడా శతకంతో ఆకట్టుకున్నాడు. వెరసి ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ నేపథ్యంలో మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటింగ్‌ సత్తాకు పరీక్ష ఎదురుకానుంది. ఈ మ్యాచ్‌లో పరిస్థితులు టీమిండియాకు అనుకూలంగా మారా లంటే కనీసం ఒకటిన్నర రోజయినా బ్యాటింగ్‌ చేయాల్సి ఉం టుంది. రోహిత్‌ శర్మ, గిల్‌, పుజారా, కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌ తమ స్థాయికి తగ్గట్టు రాణిస్తే టీమిండియా మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరడం పెద్ద కష్టమేం కాదు. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య ఇక్కడి నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగు తున్న నాలుగో టెస్టులో రెండో రోజు శుక్రవారం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 17, శుభమన్‌ గిల్‌ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 255/4తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రే లియా అదే జోరు కొనసాగిం చింది. ఖవాజా, గ్రీన్‌ ఇద్దరూ టీమిండియా బౌలర్లను ఏమాత్రం తొట్రు పాటు లేకుండా ఎదుర్కొని పరుగులు పిండు కున్నారు. ఈ క్రమంలో సెంచరీ పూర్తి చేసుకున్న గ్రీన్‌… అశ్విన్‌కు దొరికిపోయి పెవిలియన్‌ చేరాడు. ఫలితంగా 208 పరుగుల ఐదో వికెట్‌ భాగస్వా మ్యానికి తెరపడిరది. 170 బంతులు ఆడిన గ్రీన్‌ 18 ఫోర్లతో 114 పరుగులు చేశాడు. ఆ తర్వాత అలెక్స్‌ కేరీ (0), స్టార్క్‌ (6) వెంటవెంటనే పెవిలియన్‌ చేరినప్పటికీ ఖవాజా మాత్రం అదే జోరు కొనసాగించాడు. 150 పరుగులు పూర్తి చేసి డబుల్‌ సెంచరీ దిశగా దూసుకెళ్తున్నట్టు కనిపించిన ఖవాజాను అక్షర్‌ పటేల్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 422 బంతులు ఆడిన ఖవాజా 21 ఫోర్లతో 180 పరుగులు పూర్తి చేసుకున్నాడు. చివర్లో లియాన్‌ (34), టాడ్‌ మర్పీ (41) కాసేపు భారత బౌలర్లను ఎదురొడ్డారు. ఆస్ట్రే లియా ఇన్నింగ్స్‌లో ఒక్క సిక్సర్‌ కూడా లేకపోవడం గమనార్హం. టీమిండియా స్టార్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 6 వికెట్లు తీయగా, షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. జడేజా, అక్షర్‌ చెరో వికెట్‌ తీశారు.
బోర్డర్‌గవాస్కర్‌ ట్రోఫీలో... బోర్డర్‌గవాస్కర్‌ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్‌ గుర్తింపు సాధించాడు. ఆసీస్‌ ప్రధాన స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌తో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అశ్విన్‌, లియాన్‌ ఖాతాలో 113 వికెట్లు ఉన్నాయి. మూడు టెస్టుల్లో చెలరేగిన అశ్విన్‌ నాలుగో టెస్టులోనూ సత్తా చాటాడు. కీలక సమయంలో వికెట్లు తీసి భారత్‌ను పోటీలోకి తెచ్చాడు. ఐదో వికెట్‌కు 208 పరుగులు చేసిన ఉస్మాన్‌ ఖవాజా, కామెరూన్‌ గ్రీన్‌ జోడిని అతను విడదీశాడు. ఒకే ఓవర్‌లో గ్రీన్‌, అలెక్స్‌ క్యారీలను ఔట్‌ చేశాడు. మర్ఫీని ఔట్‌ చేసి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img