Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆ పరీక్షలోనూ రవిశాస్త్రికి పాజిటివ్‌

లండన్‌ : భారత క్రికెట్‌ జట్టు ప్రధాన కోచ్‌ రవిశాస్త్రికి ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షల్లోనూ కోవిడ్‌`19 పాజిటివ్‌గా తేలింది. దీంతో మరో10 రోజుల పాటు ఆయన క్వారంటైన్‌లో ఉండనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ కారణంగా ఇంగ్లాండ్‌తో జరగనున్న చివరి (ఐదవ) టెస్టు సమయంలో శాస్త్రి జట్టుకు దూరంగా ఉండనున్నాడు. ఆదివారం చేసిన ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల్లో శాస్త్రికి పాజిటివ్‌గా తేలగా, దానిని ధ్రువీకరించుకోవడానికి సోమవారం చేసిన ఆర్‌టీ-పీసీఆర్‌లోనూ అదే ఫలితం వచ్చింది. ఆయనకు గొంతులో మంట లాంటి తేలికపాటి లక్షణాలున్నట్లు తెలుస్తోంది. కాగా శాస్త్రితో సన్నిహితంగా ఉన్న బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌. శ్రీధర్‌, ఫిజియోథెరపిస్ట్‌ నితిన్‌ పటేల్‌ కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు. క్రికెటర్లు, సిబ్బందికి ఇదివరకే వాక్సినేషన్‌ పూర్తయింది.
అదే కారణమా?: టీమ్‌ హోటల్‌ లో తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సమయంలోనే రవిశాస్త్రికి వైరస్‌ సోకి ఉంటుందని వైద్యులు అనుమానిస్తున్నారు. ఆ కార్యక్రమానికి బయటి వ్యక్తులతో పాటు అరుణ్‌, పటేల్‌, శ్రీధర్‌ కూడా హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img