Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇంగ్లండ్‌ జట్టుకు షాక్‌

లండన్‌ : టీ20 ప్రపంచకప్‌ 2021 ఆరం భానికి ముందు ఇంగ్లండ్‌ జట్టుకు షాక్‌ తగిలింది. వెన్నునొప్పి కారణంగా ఆ జట్టు లోని స్టార్‌ ఆల్‌రౌండర్‌ సామ్‌ కరన్‌ ప్రపం చకప్‌ నుంచి వైదొలిగాడు. సామ్‌ కరన్‌ స్థానంలో అతని సోదరుడు టామ్‌ కరన్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. కాగా రీస్‌ టోప్లేను రిజర్వ్‌ ప్లేయర్‌గా ఎంపిక చేసినట్లు తెలిపింది. ఇప్పటికే బెన్‌ స్టోక్స్‌ రూపంలో సేవలు కోల్పోయిన ఇంగ్లండ్‌ తాజాగా సామ్‌ కరన్‌ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్‌ను కూడా కోల్పోవాల్సి వచ్చింది. సామ్‌ కరన్‌ ఇంగ్లండ్‌ తరపున 24 టెస్టుల్లో 815 పరుగులు.. 47 వికెట్లు, 11 వన్డేల్లో 141 పరుగులు.. 12 వికెట్లు, 16 టీి20ల్లో 91 పరుగులు.. 16 వికెట్లు తీశాడు. ప్రస్తు తం ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున ఆడుతున్న సామ్‌ కరన్‌ శనివారం రాజస్థాన్‌ రాయల్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్‌ అనంతరం సామ్‌ కరన్‌ను పరీక్షల కోసం స్కానింగ్‌కు పంపిం చారు. తాజాగా వెల్లడిరచిన రిపోర్ట్స్‌లో సామ్‌కు గాయం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఈసీబీ తెలిపింది. ఈ మేరకు మరో రెండురోజుల్లో యూకేకు చేరుకోనున్న సామ్‌ కరన్‌ను తదుపరి మెడికల్‌ పరీక్షలకు పంపనున్నట్లు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img