Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఇంగ్లండ్‌ భారీ ఆధిక్యం

రూట్‌ సెంచరీ
ప్రస్తుతం 158 లీడ్‌

నాటింగ్‌హామ్‌: భారత్‌`ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో ఇంగ్లండ్‌ ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. కెప్టెన్‌ జో రూట్‌ సెంచరీ సాధించాడు. అతడికి తోడుగా క్రీజులో శామ్‌ కర్రన్‌ ఉన్నాడు. అంతుకుముందు రెండో ఇన్నింగ్స్‌ను బర్న్స్‌, సిబ్లీ కలిసి ప్రారంభించారు. వీరిద్దరూ నిలకడగా ఆడుతూ స్కోరు వేగం పెంచసాగారు. ఈ తరుణంలోనే మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగించింది. దీంతో 11.1 ఓవర్ల వద్ద మ్యాచ్‌ను కొంతసేపు నిలిపివేశారు. అనంతరం మూడు రోజు ఆట నిలిచిపోయింది. ఆ సమయానికి ఇంగ్లండ్‌ 25 పరుగులు చేసింది. ఇక నాలుగో రోజు ఆటలో సిరాజ్‌ వేసిన బంతికి బర్న్స్‌ (18) పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. మరికొద్దిసేపటికి క్రాలే(6) బుమ్రా చిక్కాడు. దీంతో ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యతను చేపట్టిన కెప్టెన్‌ జో రూట్‌ ఆచితూచి నెమ్మదిగా ఆడసాగాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్‌ స్కోరు 100 దాటింది. భోజన విరామం అనంతరం రెండు వికెట్లు కోల్పోయినా బెయిర్‌స్టో అండతో రూట్‌ ధాటిగా ఆడసాగాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు రెండో సెషన్‌ పూర్తయ్యేసరికి ఆ జట్టు 70 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఈ క్రమంలో కెప్టెన్‌ జోరూట్‌ శతకం చేశాడు. ప్రస్తుతం అతడికి తోడుగా కర్రన్‌ (10) క్రీజులో ఉన్నాడు. దీంతో టీమిండియాపై ఇంగ్లండ్‌ 158 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img