Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇండోర్‌లో మూడో టెస్టు

ముంబై: బోర్డర్‌-గవాస్కర్‌ సిరీస్‌లో భాగంగా భారత్‌, ఆస్ట్రేలియా మధ్య మార్చి 1 నుంచి ధర్మశాలలో జరగాల్సిన మూడో టెస్టును మరో చోటుకు తరలించారు. మూడో టెస్టుకు ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ధర్మశాలలో ఔట్‌ఫీల్డ్‌ సిద్ధంగా లేకపోవడమే అందుకు కారణమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. బీసీసీఐ క్యురేటర్‌ తపోష్‌ ఛటర్జీ ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌పీసీఏ) స్టేడియం పిచ్‌, ఔట్‌ఫీల్డ్‌ను తనిఖీ చేసి బోర్డుకు నివేదిక అందించాడు. అయితే, తొలుత ఈ మ్యాచ్‌ని విశాఖపట్నం లేదా బెంగళూరుకు తరలిస్తారని వార్తలొచ్చాయి. చివరికి ఇండోర్‌ని వేదికగా ఖరారు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇక, సిరీస్‌ విషయానికొస్తే నాగ్‌పుర్‌లో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. దిల్లీ వేదికగా ఫిబ్రవరి 17 నుంచి రెండో టెస్టు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కూడా కంగారు జట్టును కంగుతినిపించాలని టీమిండియా భావిస్తోంది. తొలి టెస్టులో ఘోర ఓటమిపాలైన ఆసీస్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి పుంజుకోవాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కొత్త స్పిన్నర్‌ మాట్‌ కుహ్నెమాన్‌ను జట్టులోకి తీసుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img