Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఐసీసీ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా గంగూలీ

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) పురుషుల కమిటీ చైర్మన్‌గా భారత మాజీ కెప్టెన్‌, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రెసిడెంట్‌ సౌరవ్‌ గంగూలీ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీనే ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు ఈ పదవి బాధ్యతలను నిర్వర్తించిన భారత దిగ్గజ క్రికెట్‌ అనిల్‌ కుంబ్లే నిబంధనలకు మేరకు తప్పుకున్నాడని, అతని స్థానాన్ని దాదా భర్తీ చేస్తాడని తెలిపింది. ‘ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీని నియమించడం ఆనందంగా ఉంది. బ్యాటర్‌గా, క్రికెట్‌ పాలకుడిగా గంగూలీకి ఉన్న అనుభవం క్రికెట్‌లో ఉత్తమ నిర్ణయాలు తీసుకునేలా దోహదపడాలని ఆశిస్తున్నాను. తొమ్మిదేళ్లుగా ఈ కమిటీ ఛైర్మన్‌గా సేవలిందించిన అనిల్‌ కుంబ్లేకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. డీఆర్‌ఎస్‌ అమలు సహా పలు కీలక నిర్ణయాల్లో కుంబ్లే పాత్ర కీలకం’’ అని ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లే ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఐసీసీ నిబంధనల ప్రకారం కీలక పదవుల్లో మూడు పర్యాయల కంటే ఎక్కువ కాలం కొనసాగరాదు. ఆ క్రమంలోనే మూడేళ్ల చొప్పున మూడు సార్లు ఐసీసీ కమిటీ చైర్మన్‌గా ఉన్న కుంబ్లే తప్పుకోవాల్సి వచ్చింది. అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలన నేపథ్యంలో ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు కార్యాచరణను సమీక్షించేందుకు ఓ వర్కింగ్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఇమ్రాన్‌ ఖ్వాజా(ఛైర్మన్‌), రాస్‌ మెక్‌కలమ్‌, లాసన్‌ నైడో, రమీజ్‌ రాజాను గ్రూప్‌ సభ్యులుగా నియమించింది. మరికొన్ని నెలల్లో ఈ గ్రూప్‌.. నివేదికను సమర్పించనుంది. అఫ్గాన్‌ పురుషుల, మహిళల జట్టును ప్రోత్సహించే దిశగా ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల జట్లలోనూ ఫస్ట్‌క్లాస్‌, లిస్ట్‌`ఏ విభాగాలుంటాయని ఐసీసీ తెలిపింది. ఐసీసీ ఉమెన్‌ క్రికెట్‌ కమిటీలో వెస్టిండీస్‌ క్రికెట్‌ కమిటీ సీఈఓ జానీ గ్రేవ్‌ను నియమించినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img