Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఒలింపిక్స్‌ క్రీడా మహోత్సవం ప్రారంభం

ఒలింపిక్స్‌ క్రీడా మహోత్సవం ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో పరిమిత అనుమతుల మధ్య.. అత్యంత సాదాసీదాగా 1000 మంది అతిథుల సమక్షంలో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30కు మొదలయ్యాయి. జపాన్‌ చక్రవర్తి నరహిటో క్రీడలను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి భారత్‌ నుంచి 22 మంది క్రీడాకారులు, ఆరుగురు అధికారులు హాజరయ్యారు. ప్రపంచదేశాల నుంచి 20 మంది విశిష్ట అతిథులు హాజరయ్యారు. ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని హాకీ పురుషుల జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌ త్రివర్ణ పతకాన్ని చేబూని నడిపించారు. ఒలింపిక్స్‌ ప్రారంభానికి ముందు జపాన్‌ పతాకం స్టేడియంలోకి ప్రవేశించింది.చారిత్రక నేపథ్యం కలిగిన గ్రీస్‌ బృందంతో పరేడ్‌ మొదలైంది. ఐవోసీ శరణార్థి ఒలింపిక్‌ జట్టును స్టేడియంలోకి ఆహ్వానించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img