Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఒలింపిక్స్‌ విజేతలకు ప్రమోషన్‌

న్యూదిల్లీ : టోక్యో ఒలిం పిక్స్‌లో సత్తాచాటిన క్రీడాకారులకు ‘సాయ్‌’ ప్రమోషన్లను ప్రకటిం చింది. దీనికి సంబం ధించి సాయ్‌ 55వ పాలకమండలి సమా వేశంలో నిర్ణయం తీసుకున్నారు. మహిళా హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌, గోల్‌ కీపర్‌ సవితా పునియాతో పాటు పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన మరియప్పన్‌ తంగవేలు, శరద్‌ కుమార్‌లకు ప్రమోషన్లు లభించాయి. వీరితో పాటు ఒలింపిక్స్‌లో మహిళా హాకీ జట్టు కోచ్‌ బృందంలో ఉన్న పీయూష్‌ దూబేకూ ప్రమోషన్‌ ఆఫర్‌ వచ్చింది. దీంతో పాటు సాయ్‌ సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు ఇలా ఉన్నాయి : ఇటీవల లివర్‌ కేన్సర్‌తో మరణించిన బాక్సర్‌ డిరగో సింగ్‌ కుటుంబానికి 6.87 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు సాయ్‌ వెల్లడిరచింది. ఇక ప్రమోషన్ల విషయానికి వస్తే.. హాకీ గోల్‌ కీపర్‌ సవితను అసిస్టెంట్‌ కోచ్‌ నుంచి కోచ్‌గా, మహిళా హాకీ జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్‌, ప్రవీణ్‌ దూబేలను సీనియర్‌ కోచ్‌లగా ప్రమోట్‌ చేశారు. పారాలింపిక్స్‌లో రెండోసారి పతకం సాధించిన హైజంపర్‌ మరియప్పన్‌కు చీఫ్‌ కోచ్‌ నుంచి సీనియర్‌ కోచ్‌గా, శరద్‌ కుమార్‌కు అసిస్టెంట్‌ కోచ్‌ నుంచి కోచ్‌గా బాధ్యతలు అప్పగించారు.2024, 2028 ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని సాయ్‌, టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ ను మరింత బలోపేతం చేసేందుకు ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. అందుకోసం వివిధ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. స్పోర్ట్స్‌ సైన్స్‌ అనుభవ జ్ఞులు, హై పర్ఫామెన్స్‌ కోచ్‌లతో పాటు మరికొందరు ప్రొఫెషనల్స్‌ను సాయ్‌ నియమించనుంది.సైంటిఫిక్‌ స్టాఫ్‌లో 300 అదనపు పోస్టులకు సాయ్‌ అనుమతినిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img