Friday, April 19, 2024
Friday, April 19, 2024

కాంస్యం గెలవడం సంతృప్తినిచ్చింది : సింధు

టోక్యో : ఒలింపిక్స్‌ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కాంస్య పతకం గెలవడం ఎంతో సంతృప్తినిచ్చిందని భారత అగ్రశ్రేణి షట్లర్‌, టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత పీవీ సింధు పేర్కొంది. సోమవారం ఆమె టోక్యో నుంచి కోచ్‌ పార్క్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఒలిం పిక్స్‌లో ఆదివారం జరిగిన మహిళల బ్యాడ్మింటన్‌ కాంస్య పతక పోరులో చైనాకు చెందిన బింగ్జియావోపై విజయం సాధించిన తర్వాత తొలిసారి సింధు మీడియాతో ముచ్చ టించింది. ‘‘కరోనా సమయంలో నా బలహీన తలపై దృష్టి పెట్టా. నాకు శిక్షణ ఇచ్చేందుకు కోచ్‌ పార్క్‌ ఎంతో కష్టపడ్డారు. డిఫెన్స్‌ మెరుగు పరుచుకోవడం వల్లనే పతకం సాధ్యమైంది. గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్‌ ఎంతో ఉపయోగ పడిరది. దేశానికి పతకం తీసుకురావడం గర్వంగా ఉంది. అదే సమయంలో సెమీస్‌లో ఓడిపోవటం చాలా బాధగా అనిపించింది. సెమీస్‌ ఓటమి సమ యంలో భావోద్వేగానికి లోనయ్యా. కాంస్యం సాధించ డానికి అవకాశం ఉందని సర్ది చెప్పుకొన్నా. పారిస్‌ ఒలింపిక్స్‌కు ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నా. ఈ విజయాన్ని నా కుటుంబానికి, అభిమానులకు అంకితం చేస్తున్నా’’ అని సింధు తెలిపింది.
తైజూకు సింధు ఓదార్పు : ఒలింపిక్స్‌లో కాంస్యంతో భారత్‌ పేరును మారుమోగించిన సింధు.. ఇటు తన ప్రవర్తనతోనూ దేశానికి మరింత కీర్తిని తీసుకొచ్చింది. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌లో ఓడిపోయిన చైనీస్‌ తైపీ క్రీడాకారిణి తై జూ యింగ్‌లో స్ఫూర్తి నింపింది. ఇదే తైజూ చేతిలో సెమీస్‌లో సింధు ఓడిపోయింది. అవేవీ పట్టించుకోకుండా.. ముందుకొచ్చి అండగా నిలిచింది. సింధూని గెలిచి ఫైనల్‌ చేరిన తైజూ.. చైనా క్రీడాకారిణి చెన్‌ యూఫీతో తలపడి ఉత్కంఠ పోరులో ఓడిపోయింది. ఆ తర్వాత బహుమతి పురస్కార కార్యక్రమంలో పీవీ సింధు.. తై జూ యింగ్‌ను హృదయానికి హత్తుకుని ‘‘నాకు అన్నీ తెలుసు.. నువ్వు చాలా అలసిపోయావు.. అయినప్పటికీ అద్భుతంగా ఆడావు.. కానీ ఈ రోజు నీది కాదు’’ అని ఓదార్చింది. దీంతో తై జూ భావోద్వేగానికి లోనైంది. ‘సింధు ప్రోత్సాహం చూసి నాకు కన్నీళ్లు ఆగలేదు’ అని చెప్పింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img