Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

కోల్‌కతాపై పంజాబ్‌ కింగ్స్‌ విజయం

మొహలీ: ఐపీఎల్‌ 16వ సీజన్‌ రెండో మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ శుభారంభం చేసింది. కాకపోతే డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతిలో తొలి విజయం వరించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శనివారం పీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది.192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్‌ వర్షం పడే సమయానికి 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి అమలు చేశారు. ఈ లెక్కన కేకేఆర్‌ ఏడు పరుగులు వెనుకబడి ఉంది. దీంతో పంజాబ్‌ మ్యాచ్‌ గెలిచినట్లు అంపైర్లు ప్రకటించారు. పంజాబ్‌ బౌలర్‌ అర్షదీప్‌ సింగ్‌ 19 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసుకొని మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బానుక రాజపక్స 50 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్‌ ధావన్‌ 40 రాణించాడు. చివర్లో సామ్‌ కరన్‌ 17 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 26 నాటౌట్‌, షారుక్‌ ఖాన్‌ ఏడు బంతుల్లో 11 పరుగులు నాటౌట్‌ దాటిగా ఆడారు. కేకేఆర్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి, ఉమేశ్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. కేకేఆర్‌ 16 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసిన సమయానికే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. 80 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కేకేఆర్‌ను రసెల్‌, వెంకటేశ్‌ అయ్యర్‌లు నిలబెట్టే ప్రయత్నం చేశారు. నిజానికి డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి అనుసరించే పరిస్థితి లేకపోయినా ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ గెలిచేదే. 29 పరుగులకే తొలి మూడు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు, పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. బానుక రాజపక్స 50 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. శిఖర్‌ ధావన్‌ 40 రాణించాడు. చివర్లో సామ్‌ కరన్‌ 17 బంతుల్లో రెండు సిక్సర్ల సాయంతో 26 నాటౌట్‌, షారుక్‌ ఖాన్‌ ఏడు బంతుల్లో 11 పరుగులు నాటౌట్‌ దాటిగా ఆడారు. కేకేఆర్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ రెండు వికెట్లు పడగొట్టగా.. వరుణ్‌ చక్రవర్తి, ఉమేశ్‌ యాదవ్‌, సునీల్‌ నరైన్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img