Friday, April 19, 2024
Friday, April 19, 2024

కోహ్లీ నిర్ణయానికి ఆ ముగ్గురి ఫిర్యాదే కారణమా?

ముంబై : విరాట్‌ కోహ్లీ టీమిండియా టీ20 కెప్టెన్సీ వదులుకోవడం వెనుక అసలు కారణం వేరే ఉందని ఓ ప్రముఖ వార్తా పత్రిక తాజా కథనం ప్రచురిం చింది. ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ పూర్తయిన నాటి నుంచి టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లు అశ్విన్‌, రహానే, పుజారాలు కోహ్లీపై అసంతృప్తిగా ఉన్నారని, ఆ ముగ్గురే కోహ్లీపై బీసీసీఐకి ఫిర్యాదు చేశారని తెలిపింది. దీన్ని పరిగణలోకి తీసుకునే కోహ్లి ప్రమేయం లేకుండా టీమిండియా టీ20 ప్రపంచకప్‌ జట్టును ప్రకటించడంతో ఇది నచ్చకే కోహ్లీ టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పు కోవాలని నిర్ణయించుకున్నాడని ఆ కథనం వెల్లడిరచింది. డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ఓటమికి పుజారా, రహానే, అశ్విన్‌లను బాధ్యులని చేస్తూ.. కోహ్లి నోరుపారేసుకోవడంతో వివాదం మొదలైందని, అది కాస్తా చినికి చినికి గాలి వానలా మారి కోహ్లి టీ20 కెప్టెన్సీకే ఎసరు పెట్టిందని ప్రచురించింది. అలాగే, టీ20 ప్రపంచకప్‌ తర్వాత కోహ్లి వన్డే కెప్టెన్సీని వదులుకోవడంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img