Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టీమిండియా ఘన విజయం

లండన్‌ : భారత్‌ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్ల మధ్య ఓవల్‌ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా విజయ దుందుభి మోగించింది. టీమిండియా నిర్దేశించిన 368 పరుగుల లక్ష్యానికి గాను రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 210 పరుగులకే ఆలౌట్‌ కావడం తో 157 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం ఆందుకుంది. ఉమేశ్‌ బౌలింగ్‌లో ఆండర్సన్‌(2) ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌కు తెరపడిరది. భారత బౌలర్లలో ఉమేశ్‌ యాదవ్‌ 3 వికెట్లు తీయగా బుమ్రా, శార్దూల్‌, జడేజా తలో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించారు. ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 291 పరుగుల లక్ష్యంతో ఆఖరి రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌కు తొలి సెషన్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (505 ఫోర్లు) అర్ధశతకం పూర్తయిన వెంటనే పెవిలియన్‌కు చేరాడు. శార్దూల్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ పంత్‌ క్యాచ్‌ అందుకోవడంతో ఇండ్‌ 100 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. లంచ్‌ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసిన ఇంగ్లండ్‌ పటిష్టంగానే ఉన్నట్టు కనిపించింది. అయితే, ఆ తర్వాత హసీబ్‌ హమీద్‌ (63), ఒల్లీ పోప్‌ (2), జానీ బెయిర్‌స్టో (0), మొయీన్‌ అలీ (0) ఒకరి తర్వాత ఒకరిగా వెనుదిరిగారు. మలాన్‌ (5) రనౌట్‌ అయ్యాడు. కెప్టెన్‌ రూట్‌ (36 ) ఇన్నింగ్స్‌ను చక్క దిద్దేందుకు ప్రయత్నించినా.. ఠాకూర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. వికెట్లు తీయడమే లక్ష్యంగా భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఇంగ్లాండ్‌ ఏ దశలోనూ లక్ష్య ఛేదన దిశగా వెళుతున్నట్లు కనిపించలేదు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 191 పరుగులకు ఆలౌట్‌కాగా.. ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ శతకంతో సత్తా చాటడం వల్ల రెండో ఇన్నింగ్స్‌లో 466 పరుగుల భారీ స్కోరు చేసిన భారత జట్టు ప్రత్యర్థికి 368 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
50 ఏళ్ల నిరీక్షణకు తెర..
ఓవల్‌ గడ్డపై విజయానికి 50 ఏళ్ల నిరీక్షణకు టీమిండియా తెరదించింది. ఈ మైదానంలో భారత్‌ చివరి సారిగా 1971లో టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచింది. మళ్లీ ఇనేళ్లకు కోహ్లి నేతృత్వంలో భారత్‌ 157 పరుగుల భారీ తేడాతో చారిత్రక విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img