Friday, April 19, 2024
Friday, April 19, 2024

టేలర్‌ రికార్డును అధిగమించిన విలియమ్సన్‌

వెల్లింగ్టన్‌ : ఇంగ్లాండ్‌తో జరుగు తున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కేన్‌ విలియమ్సన్‌ (132) పరుగులు చేసి టెస్టుల్లో 26వ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమం లోనే రాస్‌ టేలర్‌ని అధిగ మించి టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన న్యూజిలాండ్‌ క్రికె టర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు సంబంధించి విలియమ్సన్‌ (7787) పరుగులతో అగ్రస్థానంలో ఉండగా, రాస్‌ టేలర్‌ (7683) రెండో స్థానంలో నిలిచాడు. స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ (7172), బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌ (6453), మార్టిన్‌ క్రోవ్‌ (5444) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. రాస్‌ టేలర్‌ 196 ఇన్నింగ్స్‌లో ఈ ఘనతను సాధించగా.. విలియమ్సన్‌ 161 ఇన్నింగ్స్‌ల్లోనే టేలర్‌ రికార్డుని బద్దలు కొట్టాడు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో తడబడిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకుని ఇంగ్లాండ్‌కు 258 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకే ఆలౌటైన కివీస్‌ను ఇంగ్లాండ్‌ ఫాలోఆన్‌ ఆడిరచింది. ఈ సారి న్యూజిలాండ్‌ ఆటగాళ్లు క్రీజులో నిలదొక్కుకుని 483 పరుగులు చేసి ఆలౌటయ్యారు. విలియమ్సన్‌ (132)తోపాటు టామ్‌ లేథమ్‌ (83), టామ్‌ బ్లండెల్‌ (90), డారిల్‌ మిచెల్‌ (54) జట్టును ఆదుకున్నారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ వికెట్‌ నష్టానికి 48 పరుగులు చేసింది. మరో 210 పరుగులు చేస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. ఇంగ్లాండ్‌ 435/8 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img