Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

డకౌట్స్‌లో రోహిత్‌ రికార్డును సమం చేసిన దినేశ్‌ కార్తీక్‌

బెంగళూరు: టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌ పేలవ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ విఫలమై నిరాశపరిచాడు. ఆడమ్‌ జంపా బౌలింగ్‌లో రెండో బంతికే డీకే వికెట్ల ముందు దొరికిపోయాడు. అయితే అంపైర్‌ తొలుత నాటౌట్‌గా ప్రకటించాడు. డీఆర్‌ఎస్‌కు వెళ్లిన రాజస్థాన్‌కు ఫలితం సానుకూలంగా వచ్చింది. దీంతో సున్నా పరుగులకే కార్తిక్‌ పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో మరో చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో 16 సార్లు డకౌట్‌గా వెనుదిరిగిన బ్యాటర్‌గా అవతరించాడు. దీంతో ముంబై కెప్టెన్‌ రోహిత్‌ రికార్డును సమం చేశాడు. రోహిత్‌ కూడా 239 మ్యాచుల్లోని 234 ఇన్నింగ్స్‌ల్లో 16 సార్లు పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఇప్పుడు దినేశ్‌ కార్తిక్‌ 241 మ్యాచుల్లోని 220 ఇన్నింగ్స్‌ల్లో 16వ సారి డకౌట్‌ అయ్యాడు. వీరిద్దరి తర్వాత సునీల్‌ నరైన్‌ (161 మ్యాచుల్లోని 95 ఇన్నింగ్స్‌లు) 15సార్లు, మన్‌దీప్‌ సింగ్‌ (111 మ్యాచుల్లో 98 ఇన్నింగ్స్‌లు) 15 సార్లు, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, మనీశ్‌ పాండే, అంబటి రాయుడు పద్నాలుగేసి డకౌట్లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img