Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

డబ్ల్యూపీఎల్‌ వేలంలో తెలుగమ్మాయిల సత్తా

ముంబై: మార్చిలో ప్రారంభంకానున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) క్రికెట్‌ కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సోమవారం జరిగిన లీగ్‌ వేలం-2023లో ఆరుగురు తెలుగు అమ్మాయిలు వివిధ జట్లకు ఎంపికయ్యారు. అంజలి శర్వాణి, సబ్బినేని మేఘన, షబ్నమ్‌ షకీల్‌, సొప్పదండి యషశ్రీ, అరుంధతి రెడ్డి, స్నేహ దీప్తి తమ ఆటతో సత్తా చాటి ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించారు. కర్నూల్‌ జిల్లా ఆదోనికి చెందిన లెఫ్టార్మ్‌ పేస్‌ బౌలర్‌ అంజలి శర్వాణి భారత్‌ తరపున 6 టీ20లు మ్యాచ్‌లు ఆడిరది. ఈమెను రూ.55 లక్షలకు యూపీ వారియర్స్‌ ఎంపిక చేసుకుంది. అండర్‌-19 ప్రపంచకప్‌ జట్టు క్రీడాకారిణి విశాఖకు చెందిన రైట్‌ ఆర్మ్‌ పేస్‌ బౌలర్‌ షబ్నమ్‌ షకీల్‌ను గుజరాత్‌ జెయింట్స్‌ రూ.10 లక్షలకు ఎంపిక చేసుకుంది. ఇదే ప్రాంతానికి చెం దిన వి.స్నేహ దీప్తి భారత్‌ తరపున 1 వన్డే, 2 టీ20లు ఆడి తన ప్రతిభను కనబరించింది. ఈమెను దిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ రూ.30 లక్షలకు ఎంపిక చేసుకుంది.విజయవాడకు చెం దిన సబ్బినేని మేఘన…టీమ్‌ఇండియా తరపున 3 వన్డేలు , 17 టీ20 మ్యాచ్‌లు ఆడిరది. ఈమెను గుజరాత్‌ జెయింట్స్‌… రూ.30 లక్షలకు కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన పేస్‌బౌలర్‌ సొప్పదండి యషశ్రీ ఇటీవల అండర్‌`19 ప్రపంచకప్‌లో ఆడిరది. ఈమెను యూపీ వారియర్స్‌ రూ.10 లక్షలకు ఎంపిక చేసుకుంది. ఇదేప్రాంతానికి చెం దిన రైట్‌ ఆర్మ్‌ పేస్‌ బౌలర్‌ అరుంధతి రెడ్డి… భారత్‌ తరపున 26 టీ20లు ఆడిరది. ఈమెను రూ.30 లక్షలకు దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఎంపిక చేసుకుంది. వీరిలో అంజలి శర్వాణికి అత్యధికంగా రూ.55 లక్షల ఆఫర్‌ వచ్చింది. ఇదిలా ఉండగా అండర్‌-19 మహిళల ప్రపంచకప్‌-2023లో సత్తా చాటిన తెలంగాణ అమ్మాయి, భద్రాచలానికి చెందిన గొంగడి త్రిషను మాత్రం ఏ జట్టు ఎంపిక చేసుకోలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img