Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో సంచలనం

వరల్డ్‌ ఛాంపియన్‌కు భారత కుర్రాడు షాక్‌

థాయ్‌లాండ్‌ : థాయ్‌లాండ్‌ ఓపెన్‌-2023లో భారత కుర్రాడు కిరణ్‌ జార్జ్‌ సంచలనం సృష్టించాడు. పురుషుల సింగిల్స్‌లో తనకంటే మెరుగైన ర్యాంకర్‌ అయిన వరల్డ్‌ ఛాంపియన్‌ను ఓడిరచి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. 59వ ర్యాంకర్‌ కిరణ్‌ 32వ రౌండ్‌లో 9వ ర్యాంకర్‌ షి యకీ(చైనా)పై గెలుపొందాడు. 22 ఏళ్ల కిరణ్‌ ఆట మొదలైనప్పటి నుంచి ఆధిపత్యం చెలాయించాడు. వరుస సెట్లలో 21-18, 22-20తో యకీని చిత్తు చేశాడు. దాంతో, ప్రీ – క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ‘ఒడిషా ఓపెన్‌ 100 టోర్నమెంట్‌ నుంచి కిరణ్‌ జార్జ్‌ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే అతను ఇప్పటి వరకు టైటిల్‌ గెలవలేదు. నాలుగు, ఐదు నెలల నుంచి అతడు ఆత్మవిశ్వాసంతో లేడు. అలాంటిది థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో కిరణ్‌ అనూహ్యంగా పుంజుకున్నాడు’ అని కిరణ్‌ కోచ్‌ సాగర్‌ చొప్డా తెలిపాడు. యుకీ 2018 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం గెలిచాడు.
శ్రీకాంత్‌ ఔట్‌: భారత్‌కు చెందిన అష్మిత చలిహ కూడా సత్తా చాటింది. మాలవికా బన్సోద్‌పై గెలిచి 16వ రౌండ్‌కు చేరింది. మలేషియా మాస్టర్స్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌లో వైదొలిగిన తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్‌ ఈ టోర్నీలోనై నిరాశ పరిచాడు. అవును.. అతడి పోరాటం తొలి రౌండ్‌లోనే ముగిసింది. చైనాకు చెందిన వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ చేతిలో అతను ఓటమి పాలయ్యాడు. మహిళల సింగిల్స్‌లో ఒలింపిక్‌ విజేత పీవీ సింధు ఈరోజు తొలి మ్యాచ్‌ ఆడనుంది. కెనడాకు చెందిన మిచెల్లే లితో ఆమె తలపడనుంది. మలేషియా ఓపెన్‌ టైటిల్‌ గెలిచిన హెచ్‌ ఎస్‌ ప్రణయ్‌ 26వ ర్యాంకర్‌ వాంగ్‌ జూ వే(చైనా)ను ఢీ కొట్టనున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img