Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దిగ్గజ ఆల్‌రౌండర్‌ టెడ్‌ డెక్స్‌టర్‌ కన్నుమూత

లండన్‌ : ఇంగ్లాండ్‌ క్రికెట్‌ జట్టు మాజీ టెస్టు కెప్టెన్‌, దిగ్గజ ఆల్‌రౌండర్‌ టెడ్‌ డెక్స్‌టర్‌ (86) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం.. తుదిశ్వాస విడిచినట్టు మేర్లీబోన్‌ క్రికెట్‌ క్లబ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇంగ్లాండ్‌లోని అత్యుత్తుమ క్రికెటర్లలో టెడ్‌ ఒకరని ఎంసీసీ తెలిపింది. టెడ్‌ డెక్స్‌టర్‌.. 1935 మే 15న ఇటలీలో జన్మించారు. 1956 నుంచి 1968 మధ్య టెస్టు క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ జట్టుకు సేవలు అందించారు. మొత్తం 62 మ్యాచ్‌లు ఆడగా అందులో 30 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేపట్టారు. డెక్స్‌టర్‌ తన కేరీర్‌ మొత్తంలో.. 21వేల పరుగులు చేయడం సహా 419 వికెట్లు తీశారు. టెడ్‌ మృతిపై ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ వాన్‌ సహా ఐసీసీ తాత్కాలిక ఎగ్జిక్యూటివ్‌ జియోఫ్‌ అల్లార్డిస్‌ సంతాపం వ్యక్తం చేశారు. టెడ్‌.. క్రికెట్‌కు అందించిన సేవలు మర్చిపోలేనివని కొనియాడారు. ‘యువ క్రికెటర్లకు సూచనలు ఇచ్చేందుకు టెడ్‌ ఎప్పుడూ ముందుటారు. నాతో పాటు నా తోటి క్రికెటర్లకు ఆయన ఎన్నో విలువైన సూచనలు అందించారు’ అని వాన్‌ ట్వీట్‌ చేశారు. టెడ్‌ డెక్స్‌టర్‌ క్రికెట్‌కు అందించిన సేవలకుగాను ఐసీసీ.. హాల్‌ఆఫ్‌ ఫేమ్‌లో ఈ ఏడాది ఆయన పేరును చేర్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img