Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌వార్న్‌కు కరోనా

లండన్‌ : ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్‌ షేర్న్‌వార్న్‌కు కరోనా సోకింది. ఇంగ్లాండ్‌లో జరుగుతున్న‘ది హండ్రెడ్‌’ లీగ్‌ లో లండన్‌ స్పిరిట్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా వార్న్‌ వ్యవ హరిస్తున్నాడు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన క్రమంలో సథర్న్‌ బ్రేవ్‌తో జరిగిన పోరుకు దూరమయ్యాడు. ‘‘కొంత అలసటగా అనిపించి వార్న్‌ టెస్ట్‌ చేయించుకున్నాడు. పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. జట్టు నుంచి ఐసొలేట్‌ అయ్యాడు. జట్టు మేనేజ్‌మెంట్‌ బృందంలో ఓ సభ్యుడికి కూడా కరోనా సోకింది. ఆయన కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నారు. వార్న్‌తో సన్నిహితంగా ఉన్న జట్టు సిబ్బందిలో ఒకరు పరీక్ష చేయించున్నారు. ఫలితాలు రావాల్సి ఉంది. కాగా జట్టు ఆటగాళ్లపై ఈ ప్రభావం లేదు.’’ అని లండన్‌ స్పిరిట్‌ జట్టు మేనేజ్‌మెంట్‌ ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img