Friday, April 26, 2024
Friday, April 26, 2024

దిల్లీ క్యాపిటల్స్‌ టార్గెట్‌ 135

చేతులెత్తేసిన సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌

దుబాయ్‌ : దిల్లీ క్యాపిటల్స్‌ క్యాపిటల్స్‌ బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచు కున్న సన్‌రైజర్స్‌కు ప్రారంభంలోనే భారీ షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌ మూడో బంతికే ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ డకౌటయ్యాడు. దిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ నోర్జే వేసిన ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌కు సులభమైన క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో..ఒక్క పరుగు అయినా చేయక ముందే ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఏ ఒక్కరూ నిలకడగా ఆడలేకపోయారు. జట్టు స్కోరు 29 పరుగుల వద్ద ఉండగా ఐదో ఓవర్‌లో వృద్ధిమాన్‌ సాహా (17 బంతుల్లో 18), పదో ఓవర్‌లో విలియమ్స్‌ సన్‌ (26 బంతుల్లో 18), మనీష్‌ పాండే (16 బంతుల్లో 17), 13వ ఓవర్‌లో కేదార్‌జాదవ్‌ (8 బంతుల్లో 3) ఔటయ్యారు. అబ్దుల్‌ సమీద్‌ (21 బంతుల్లో 28), రషీద్‌ఖాన్‌ (19 బంతుల్లో 22) కొంత మేర పరుగులు చేసినప్పటికీ 20 ఓవర్లు ముగిసేసరికి 9వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. దిల్లీ కేపిటల్స్‌ బౌలర్లలో రబడా 3, నోర్జీ 2, అక్సర్‌ 2 వికెట్లు చొప్పున పడగొట్టారు. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో రెండు రనౌట్లు నమోదయ్యాయి.
జట్లు :
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ : డేవిడ్‌ వార్నర్‌, వృద్ధిమాన్‌ సాహా (వికెట్‌ కీపర్‌), కేన్‌ విలియ మ్సన్‌ (కెప్టెన్‌), మనీశ్‌ పాండే, జేసన్‌ హోల్డర్‌, అబ్ధుల్‌ సమద్‌, కేదార్‌ జాదవ్‌, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌.
దిల్లీ క్యాపిటల్స్‌ : పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), మార్కస్‌ స్టొయినిస్‌, షిమ్రోన్‌ హెట్మే యర్‌, అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అన్రిచ్‌ నోర్జే, కగిసో రబాడ, అవేశ్‌ ఖాన్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img