Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

దీపక్‌ ఆటని చూసి నేర్చుకోవాలి


మాజీ క్రికెటర్‌ డ్యానిష్‌ కనేరియా
దీపక్‌ చాహర్‌ ఆటని చూసి మ్యాచ్‌ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో పాకిస్థాన్‌ క్రికెటర్లు నేర్చుకోవాలని ఆ దేశ మాజీ క్రికెటర్‌ డ్యానిష్‌ కనేరియా సూచించాడు.మంగళవారం రాత్రి ముగిసిన రెండో వన్డేలో 276 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా 35.1 ఓవర్లు ముగిసే సమయానికి 193/7తో నిలిచింది. అప్పటికే టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌లు ఎవరూ క్రీజులో లేకపోవడంతో భారత్‌ ఓటమి లాంఛనమేనని అంతా ఊహించారు. కానీ 8వ స్థానంలో బ్యాటింగ్‌కి వెళ్లిన దీపక్‌ చాహర్‌ మరో 5 బంతులు మిగిలి ఉండగానే భారత్‌ జట్టుని గెలిపించాడు. ‘భారత్‌ జట్టుని గెలిపించిన ఘనత దీపక్‌ చాహర్‌దే. పాకిస్థాన్‌ బ్యాట్స్‌మెన్‌లు అతని బ్యాటింగ్‌ నుంచి నేర్చుకోవాలి.’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img