Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ధనాధన్‌ గప్టిల్‌

42 బంతుల్లో 70 పరుగులు
అర్ధసెంచరీతో రాణించిన చాప్‌మన్‌
భువీ, అశ్విన్‌లకు చెరో రెండు వికెట్లు
టీమిండియా లక్ష్యం 165

జైపూర్‌ : భారత, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌ బుధవారం ప్రారంభమైంది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులు చేసింది. ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 42 బంతుల్లో 4I3, 4I6లతో 70 పరుగులు చేశాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చాప్‌మన్‌కూడా ఇందుకు సహకరించి, అతడు కూడా అర్ధసెంచరీ చేశాడు.
టీమిండియాకు కొత్త కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ, కొత్త కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ బాధ్యతలు స్వీకరించిన తరువాత జరుగుతున్న తొలి పోరు ఇది. దీన్లో భాగంగా ముందుగా టాస్‌ గెలిచిన టీమిండియా కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. మార్టిన్‌ గప్టిల్‌, డారెల్‌ మిచెల్‌ న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. టీమిండియా తరపున ఓపెన్‌ బౌలర్‌గా భువనేశ్వర్‌ ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టాడు. మొదటి ఓవర్‌ రెండో బంతికే ఓపెనర్‌ డారెల్‌ మిచెల్‌ (0) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మొదటి వికెట్‌ పడిన తరువాత కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. తరువాత క్రీజులోకి వచ్చిన చాప్‌మన్‌ గప్టిల్‌కు అండగా నిలబడ్డాడు. ఫోర్లు, రెండు పరుగులతో చాప్‌మన్‌ దూకుడుగా ఆడసాగాడు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్సులతో చెలరేగి ఆడాడు. దీంతో మొదటి పవర్‌ప్లే ముగిసే సమయానికి కివీస్‌ ఒక వికెట్‌ కోల్పోయి 41 పరుగులు చేసింది. వీరిద్దరూ అడపా, దడపా సింగిల్స్‌ తీస్తూ స్కోరు బోర్డు వేగం పెంచారు. ఈక్రమంలోనే 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్‌ స్కోరు 66. మరికొద్దిసేపటి ఫస్ట్‌డౌన్‌ బ్యాట్స్‌మేన్‌ చాప్‌మన్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఓ భారీ షాట్‌ కొట్టేందుకు యత్నించిన చాప్‌మన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. మొత్తంగా 50 బంతుల్లో 4I6, 6I2లతో 63 పరుగులు చేశాడు. తరువాత క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్‌ (0)ను కూడా అశ్విన్‌ పెవిలియన్‌ బాట పట్టించాడు. దీంతో పరుగులు వరద ఒక్కసారిగా ఆగింది. మరోవైపు ఓపెనర్‌ గప్టిల్‌ కూడా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
గప్టిల్‌ వీలు చిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఎట్టకేలకు దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. మొత్తంగా 42 బంతుల్లో 4I3, 6I4లతో గప్టిల్‌ 70 పరుగులు చేశాడు. మరికొద్దిసేపటికి సీఫర్ట్‌ (12) భువనేశ్వర్‌ బౌలింగ్‌లో సూర్యకుమార్‌యాదవ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. చివర్లో రవీంద్ర (7) సిరాజ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్‌ 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. టీమిండియా బౌలింగ్‌లో భువనేశ్వర్‌కు 2, అశ్విన్‌కు 2, దీపక్‌ చాహర్‌, సిరాజ్‌లకు చెరో వికెట్‌ దక్కింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img