Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

న్యూజిలాండ్‌ ఓడితే ఫిక్సింగే అంటారు

కరాచీ : టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగే కీలక లీగ్‌ మ్యాచ్‌లో న్యూజి లాండ్‌ ఓడిపోతే సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగుతుందని పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ అన్నాడు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగిం దంటూ పాక్‌ అభిమానులు ఆరోపణలు గుప్పించే అవకాశం ఉందన్నాడు. అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌పై భారీ విజయాలు సాధించిన టీమిండియా మెరుగైన రన్‌రేట్‌ పాయింట్స్‌ టేబుల్లో మూడో స్థానంలో నిలించింది. దాంతో సెమీ ఫైనల్‌ రేసు రసవత్తరంగా మారింది. గ్రూప్‌-1 నుంచి ఇంగ్లండ్‌.. గ్రూప్‌-2 నుంచి పాకిస్థాన్‌ ఇప్పటికే సెమీస్‌ చేరాయి. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం నాలుగు జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. నేటి మ్యాచ్‌లతో గ్రూప్‌-1 నుంచి ఏ జట్టు సెమీస్‌కు చేరుతుందో తెలిసిపోనుండగా.. ఆదివారం అఫ్గాన్‌-న్యూజిలాండ్‌ మ్యాచ్‌తో గ్రూప్‌-2 నుంచి ఏ జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుందో స్పష్టత రానుంది.
అఫ్గాన్‌ గెలిస్తే..
ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే ఇప్పటికే ఆరు పాయింట్లతో ఉన్న విలియమ్సన్‌ సేన నేరుగా సెమీస్‌ చేరుతుంది. అదే అఫ్గాన్‌ గెలిస్తే.. 6 పాయింట్లతో ఉండటం వల్ల రన్‌రేట్‌ విషయంలో పోటీపడాల్సి ఉంటుంది. అప్పుడు కోహ్లిసేన చివరి మ్యాచ్‌లో నమీబియాను ఎంత తేడాతో ఓడిస్తే సరిపోతుందో లెక్క తేలనుంది. ఈ నేపథ్యంలోనే తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా అక్తర్‌ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.‘అఫ్గాన్‌తో పోరులో కివీస్‌ గెలిస్తే ఏ సమస్య ఉండదని.. ఓడిపోతే మాత్రం పాక్‌ అభిమానులు ఊరుకోరని.. సోషల్‌ మీడియా వేదికగా ట్రోల్స్‌ చేయడమే పనిగా పెట్టుకుంటారు. రకరకాల హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండ్‌ చేస్తారన్నాడు.
ఫిక్సింగ్‌ అంటూ..
టీ20 ప్రపంచకప్‌కు ముందు భద్రతా కారణాల రిత్యా న్యూజిలాండ్‌ పాకిస్థాన్‌తో సిరీస్‌ను రద్దు చేసుకున్న సంగతి పాక్‌ అభిమానులు మరిచిపోలేదు. పాక్‌, కివీస్‌ చేతిలో దారుణ పరాజయాలు చవిచూసిన టీమిండియా.. అఫ్గానిస్థాన్‌, స్కాట్లాండ్‌పై ఘన విజయాలు సాధించి ఒక్కసారిగా రేసులోకి వచ్చింది. ఇప్పుడు టీమిండియా సెమీస్‌ వెళ్లాలంటే అఫ్గాన్‌ చేతిలో కివీస్‌ ఓడిపోవడం ఒక్కటే మార్గం. ఒకవేళ అలా జరిగితే మాత్రం టీమిండియా సెమీస్‌కు వెళ్లాలని న్యూజిలాండ్‌ కావాలనే ఓడిపోయిదంటూ పాక్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ ట్రోల్స్‌ చేయడం ఖాయం. అలా జరగకూడదంటే అఫ్గాన్‌పై కివీస్‌ విజయం సాధిస్తే సరిపోతుంది.’అంటూ అక్తర్‌ చెప్పుకొచ్చాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img