Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

‘పది’ పరీక్షల్లో కాపీ కొట్టాడు…
క్రికెట్‌లో జాక్‌పాట్‌ కొట్టాడు

లక్నో: ఐపీఎల్‌లో ఇప్పుడు అతడొక సంచలనం… ఒకప్పుడు ‘పది’ పరీక్షలను కాపీ కొట్టి పాస్‌ అయ్యాడు కానీ క్రికెట్‌లో మాత్రం జాక్‌పాట్‌ కొట్టాడు. అతను మరెవరో కాదు… 2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరపున ఆడుతున్న రవి బిష్ణోయ్‌. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఐపీఎల్‌ 2023 మినీ వేలానికి ముందుగా స్పిన్‌ బౌలర్‌ రవి బిష్ణోయ్‌ను తమతోనే అట్టిపెట్టుకుంది. అతడు లక్నో నుంచి ప్రతీ ఏడాది రూ. 4 కోట్లు అందుకుంటున్నాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ‘నేను పది పరీక్షలు కాపీ కొట్టి పాస్‌ అయ్యాను. సాధారణంగా అందరూ పరీక్షలకు స్లిప్పులు తీసుకెళ్తారు. కానీ అందుకు విరుద్దంగా నేను తెలివితేటలను ఉపయోగించాను. ఎగ్జామ్‌ టైమ్‌లో మన చుట్టుప్రక్కల అందరూ స్నేహితులు ఉంటే… మనకు కాపీ కొట్టడం చాలా సులభం అవుతుంది అందుకే అందరినీ ఫ్రెండ్స్‌ చేసుకున్నాను’ అని చెప్పాడు. మరోవైపు క్రికెట్‌పై ఉన్న పిచ్చితో 12వ తరగతి పరీక్షను కూడా వదిలేసి… రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు నెట్స్‌లో బౌలింగ్‌ చేయడానికి వచ్చేశానని రవి బిష్ణోయ్‌ తెలిపాడు. కాగా, ఈ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తరపున ఆడుతున్న రవి బిష్ణోయ్‌… ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. ఇక శుక్రవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరగనున్న మ్యాచ్‌లో లక్నోకి ట్రంప్‌ కార్డ్‌గా మారనున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img