Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పేదరాలి వైద్య విద్యకు సచిన్‌ సాయం

ముంబై : ఓ పేద విద్యార్థి వైద్య విద్యనభ్యసించడానికి తన సేవా ఫౌండేషన్‌ నుంచి ఆర్థిక సహాయం చేయడం ద్వారా భారత క్రికెట్‌ దిగ్గజం సచిన టెండూల్కర్‌ తనలోని దాతృత్వాన్ని చాటుకున్నాడు. దీంతో మహారాష్ట్ర రత్నగిరిలోని జైరే గ్రామంలో మొట్టమొదటి సారి దీప్తి అనే బాలిక ఎంబీబీఎస్‌ చదవనుంది. దీప్తి నీట్‌లో మెరుగైన స్కోర్‌తో అకోలా మెడికల్‌ కాలేజీలో సీటు సాధించింది. కానీ దీప్తి వ్యవసాయదారులైన ఆమె తల్లిదండ్రులకు చదవించే స్థోమత లేదు. విషయం తెలుసుకున్న టెండూల్కర్‌.. ఆయన సేవా సంస్థ సహకార ఫౌండేషన్‌ తరఫున ఆమెకు ఆర్థిక సహాయం చేశాడు. సచిన్‌ చేసిన సహాయానికి కృతజ్ఞత తెలుపుతూ.. ‘‘కష్టపడడం విజయానికి మూలం అని విన్నాను. అది రుజువు చేశాను. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు సంపాదించాను. స్కాలర్‌షిప్‌ సౌకర్యం ఇచ్చిన సచిన్‌టెండూల్కర్‌ ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు’’ దీప్తి ట్వీట్‌ చేసింది. ‘‘కలలను సాధించే వారికి దీప్తి ఓ మంచి ఉదాహరణ. కష్టించి తమ లక్ష్యాలను సాధించే ఎందరికో ఈమె స్ఫూర్తిదాయకం. విద్యార్థిని బంగారు భవిష్యత్తు కలగాలని ఆశీస్సులు’’ అంటూ సచిన్‌ రీట్వీట్‌ చేశాడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img