Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ప్రారంభమైన 18వ కామన్‌వెల్త్‌ క్రీడలు

బర్మింగ్‌హామ్‌: 11రోజుల పాటు సాగే 18వ కామన్వెల్త్‌ క్రీడలు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా గురువారం అర్ధరాత్రి ప్రారంభమయ్యాయి. 72దేశాల్లో 294రోజులపాటు సాగిన కామన్వెల్త్‌ గేమ్స్‌ టార్చ్‌ అలెగ్జాండర్‌ స్టేడియంకు గురువారం చేరుకుంది. ఆటల తొలిరోజు శుక్రవారం భారత క్రీడాకారులు వివిధ క్రీడల్లో బరిలో నిలిచారు. ప్రారంభోత్స వేడుకల భారత బృందానికి ఫ్లాగ్‌ బేరర్స్‌గా షట్లర్‌ పివి సింధు, హాకీ జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యం వహించారు. భారత్‌నుంచి ఈసారి అత్యధిక సంఖ్యలో 205మంది అథ్లెట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2010 కామన్వెల్త్‌ క్రీడల్లో 200మంది పాల్గొన్నారు. ఒలింపిక్స్‌లో రెండుసార్లు పతకాలు సాధించిన పివి సింధు, టోక్యో ఒంలింపిక్స్‌లో పతకాలు సాధించిన మీరాభాయి ఛాను, లౌలీనా బోర్గోహైన్‌తోపాటు హాకీలో మనకు పతకాలు దక్కడం ఖాయంగా ఉంది. ఈసారి మహిళల క్రికెట్‌కు తొలిసారి చోటు దక్కింది. క్రికెట్‌లో తొలిమ్యాచ్‌ భారత్‌`ఆస్ట్రేలియాల మధ్య జరగనుంది. భారత మహిళల హాకీ జట్టు ఘనాతో తలపడనుంది.ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌ వేదిక 2018లో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ 64 పతకాలను సాధించింది. జులై 28నుంచి ఆగస్టు 8వరకు జరిగే ఈ క్రీడల్లో 72 దేశాలనుంచి 20 క్రీడలకు సంబంధించి 5వేలమంది క్రీడాకారులు బరిలో ఉన్నారు.
చెన్న్తెలో 44వ చెస్‌ ఒలింపియాడ్‌ 2022
చెన్నై : భారత్‌ తొలిసారి ఆతిథ్యమిస్తున్న 44వ చెస్‌ ఒలింపియాడ్‌ చెన్నై సమీపంలోని మహాబలి పురంలో గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. 44వ చెస్‌ ఒలింపియాడ్‌ ప్రపంచ స్థాయి పోటీల ప్రారంభోత్సవ వేడుకలు గురువారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్‌స్టేడియంలో ప్రధాని మోదీ ప్రారంభించారు. వివిధ దేశాలకు చెందిన క్రీడాకారులు ర్యాలీగా సాగారు. చెస్‌ ఒలంపియాడ్‌ టార్చ్‌ను గ్రాండ్‌మాస్టర్‌ విశ్వనాథన్‌ ఆనంద్‌ వేదికపైకి తీసుకురాగా ప్రధాని మోదీ, సీఎం స్టాలిన్‌ అందుకున్నారు. ఈ పోటీల్లో పాల్గొనాలని పాకిస్థాన్‌కు అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) ఆహ్వానం పంపింది. ఒలింపియాడ్‌ ప్రారంభోత్సవానికి ముందు తాము వైదొలుగుతున్నట్లు పాక్‌ ప్రకటించింది. ఒలింపియాడ్‌ కోసం ఒలింపిక్స్‌ తరహాలో క్రీడా జ్యోతి రిలే నిర్వహించారు. ఈ జ్యోతి దేశంలోని 75 నగరాలను చుట్టివచ్చింది. టార్చ్‌ రిలే.. కాశ్మీర్‌ మీదుగా సాగినందున ఒలింపియాడ్‌ నుండి వైదొలుగుతున్నట్లు పాకిస్థాన్‌ ప్రకటించింది. ప్రారంభవేడకల్లో జాతీయగీతం, తమిళ్‌తాయ్‌ వాళ్తు గీతాలను ఆలపించారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. తమిళనాడు క్రీడలశాఖ మంత్రి శివ వీ మెయ్యనాథన్‌ స్వాగతనోపన్యాసం చేయగా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌, మంత్రి ఎల్‌. మురుగన్‌ ప్రసంగించారు. తమిళనాడు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి, రాష్ట్ర మంత్రులు, సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ తదితర ప్రముఖులు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img