Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

బుమ్రా బౌలింగ్‌ ప్రాక్టీస్‌

న్యూదిల్లీ: టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా మళ్లీ గాడిలో పడినట్లే కనిపిస్తోంది. వెన్నునొప్పితో జట్టుకు దూరమైన బుమ్రా చాలాకాలంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ఆసియా కప్‌ ప్రారంభానికి ముందే అతనికి వెన్నునొప్పి తీవ్రమైంది. దీంతో అతను జట్టుకు దూరమయ్యాడు. ఆ టోర్నీలో కూడా ఆడలేదు. టీ20 వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకొని అతన్ని త్వరపెట్టిన బీసీసీఐ ఆస్ట్రేలియాతో టీ20 మ్యాచులకు ఆడిరచింది. ఈ వ్యూహం బెడిసికొట్టింది. బుమ్రాకు వెన్నునొప్పి తిరగబెట్టింది. దీంతో అతను టీ20 వరల్డ్‌ కప్‌ కూడా ఆడలేదు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో టెస్టులకు అతన్ని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఫిట్‌నెస్‌ టెస్టును అతను క్లియర్‌ చేయలేకపోయాడు. వెన్నులో ఇబ్బందిగా ఉండటంతో అతను మళ్లీ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో అతన్ని తొందర పెట్టడం అనవసరం అనుకున్న బీసీసీఐ.. అతను కోలుకోవడానికి ఎంత టైం పడితే అంత ఇవ్వాలని నిర్ణయించింది. అందుకే అతడిని ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు టెస్టులకు కూడా ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో బుమ్రా కోలుకున్నట్లే కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అతను నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతను బౌలింగ్‌ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆస్ట్రేలియాతో జరిగే చివరి రెండు టెస్టులకు బుమ్రాను ఎంపిక చేసే అవకాశం ఉంది. లేదంటే బీసీసీఐ కొత్త రూల్స్‌ ప్రకారం అతడిని కూడా దేశవాళీల్లో ఆడిరచిన తర్వాతనే జట్టుకు తీసుకుంటారేమో చూడాలి. ఏదేమైనా బుమ్రా మళ్లీ బౌలింగ్‌ చేయడం భారత క్రికెట్‌కు శుభవార్తే అని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌ కనుక భారత్‌ గెలిచి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరితే అతను జట్టుక చాలా కీలకం కానున్నాడని అంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img