Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

బ్యాట్స్‌మెన్‌దే భారం..!

రోహిత్‌ హాఫ్‌ సెంచరీ బ క్రీజులో పుజారా, కోహ్లి
ఇంకా 212 పరుగులు వెనుకబడ్డ భారత్‌

లీడ్స్‌: హెడిరగ్లీ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మూడో రోజు ఆటలో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడుతోంది. ఈ క్రమంలోనే రెండో సెషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇక భారమంతా బ్యాట్స్‌మెన్‌పైనే ఆధారపడి ఉంది. రోహిత్‌ శర్మ (59బీ 156 బంతుల్లో 7I4, 1I6) అర్ధ శతకం చేసి ఔట్‌ అయ్యాడు. ఛెతేశ్వర్‌ పుజారా(58 నాటౌట్‌, 106 బంతుల్లో 10I4) క్రీజులో కుదురుకున్నాడు. దాంతో భారత్‌ రెండో సెసన్‌ పూర్తయ్యేసరికి ఒక వికెట్‌ కోల్పోయి 147 పరుగులు చేసింది. వీరిద్దరూ ఈ సెషన్‌లో ఒక్క వికెట్‌ కూడా పడకుండా జాగ్రత్తగా ఆడి 78 పరుగులు జోడిరచారు. ప్రస్తుతం ఇంగ్లండ్‌ కన్నా భారత్‌ 212 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భోజన విరామ సమయానికి భారత్‌ 34/1తో నిలిచిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(8) ఓవర్టన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో బెయిర్‌స్టో చేతికి చిక్కాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 423/8తో మూడో రోజు అయిన శుక్రవారం ఆట ఆరంభించిన ఇంగ్లండ్‌ మరీ ఎక్కువ పరుగులేమీ చేయలేదు. 132.2 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్‌ 432 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. క్రెయిగ్‌ ఓవర్టన్‌ (32, 42 బంతుల్లో 6I4) మొహ్మద్‌ షమీ వేసిన 130వ ఓవర్లో వరుసగా రెండు బౌండరీలు బాదాడు. 132వ ఓవర్లో అతడి బౌలింగ్‌లోనే వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ప్లేయర్‌ ఓలి రాబిన్సన్‌ (0, 15 బంతుల్లో) పరుగుల ఖాతా తెరవలేదు. జస్ప్రీత్‌ బుమ్రా వేసిన 132.2వ బంతికి బౌల్డ్‌ అయ్యాడు. జేమ్స్‌ అండర్సన్‌ (0) అజేయంగా నిలిచాడు. జో రూట్‌ (121, 165 బంతుల్లో 14I4) సెంచరీ చేయగా.. డేవిడ్‌ మలన్‌ (70) హాఫ్‌ సెంచరీ చేశాడు. ఓపెనర్లు రోరీ బర్న్స్‌ (52, 125 బంతుల్లో 5I4, 1I 6), హసీబ్‌ హమీద్‌ (60, 130 బంతుల్లో 11I4) హాఫ్‌ సెంచరీలు చేశారు. దాంతో ఇంగ్లండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగుల ఆధిక్యం దక్కింది. ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అనంతరం భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, లోకేష్‌ రాహుల్‌ ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా ఆరంభించారు. ఇద్దరూ ఆచితూచి ఆడారు. క్రీజులో కుదురు కోవడానికి చాలా సమయం తీసుకున్నారు. అయితే 19 ఓవర్ల పాటు ఎంతో ఓపికగా ఆడిన రాహుల్‌ చివరికి క్రెయిగ్‌ ఓవర్టన్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో జానీ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు. రాహుల్‌ 54 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. రాహుల్‌ ఔట్‌ అనంతరం అంపైర్లు లంచ్‌ బ్రేక్‌ ప్రకటించారు. మూడో రోజు భోజన విరామ సమ యానికి భారత్‌ ఒక వికెట్‌ నష్టా నికి 34 పరు గులు చేసిం ది. రోహిత్‌ శర్మ (25) క్రీజు లో ఉ న్నాడు. అప్పటికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌కు భారత్‌ ఇంకా 320 పరు గులు వెన కబడి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img