Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

భారత్‌లో డీఎస్‌పీ కార్యక్రమాన్ని ఆవిష్కరించిన అమెజాన్‌

విశాలాంధ్ర – సనత్‌ నగర్‌ : అమెజాన్‌ తమ డెలివరీ సర్వీస్‌ పార్టనర్‌ (డీఎస్‌పీ) కార్యక్రమంలో తరువాత దశ పరిణామాన్ని భారతదేశంలో ఆవిష్కరించింది. ఇది ఔత్సాహిక వ్యాపారవేత్తలు, మరీ ముఖ్యంగా డెలివరీ అనుభవం లేని వారికి సైతం తమ సొంత డెలివరీ అనుభవంతో అభివృద్ధి చేసి ప్రారంభించేందుకు తగిన అవకాశాలను అందిస్తుంది. చిరు వ్యాపార యజమానులకు అమెజాన్‌ ఇండియా ఇప్పటికే మొదటి బ్యాచ్‌లో 40కు పైగా నూతన డీఎస్‌పీలను ప్రోగ్రామ్‌ ద్వారా ఎంపిక చేసింది. భవిష్యత్‌లో మరిన్ని అవకాశాలను వ్యవస్థాపకులకు తెరువనున్నారు. డీఎస్‌పీ ప్రోగ్రామ్‌ నూతన పరిణామాన్ని ఇప్పటికే యునైటెడ్‌ స్టేట్స్‌, కెనడా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, ఐర్లాండ్‌, బ్రెజిల్‌ , నెదర్లాండ్స్‌లో తెరువగా ఇప్పుడు ఇండియాలో తెరిచారు. దీని ద్వారా చిరు వ్యాపార సంస్థలు తమ స్థానిక సమాజంలో వేలాది ఉపాధి అవకాశాలను సృష్టించడమూ వీలవుతుంది. ‘‘డెలివరీ సర్వీస్‌ పార్టనర్‌ ప్రోగ్రామ్‌ ద్వారా వేలాది మంది చిరు వ్యాపార యజమానులు వృద్ధి చెందడంతో పాటుగా ప్రయోజనం పొందడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఈ కార్యక్రమ వృద్ధితో, మేము మా డీఎస్‌పీలు వారి అసోసియేట్‌ల అనుభవాలను మరింతగా వృద్ధి చేసేందుకు తగిన మార్గాలను అన్వేషించాం. ఈ నూతన ఆఫరింగ్‌, ఇన్‌క్యుబేటర్‌గా సేవలనందించడంతో పాటుగా ఔత్సాహిక వ్యాపారవేత్తలకు వేగవంతమైన వృద్ధి అవకాశాలను సైతం లాజిస్టిక్స్‌ రంగంలో తీసుకువస్తుంది. తద్వారా వారు అదనపు ఉద్యోగావకాశాలను సృష్టించడంతో పాటుగా అసోసియేట్లకు అత్యున్నత పని వాతావరణాన్నీ సృష్టిస్తూనే తమ సొంత వ్యవస్థాపక ప్రయోజనం కోసం బలమైన పునాదులనూ నిర్మించనుంది’’ అని వీపీ కస్టమర్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ అమెజాన్‌ అఖిల్‌ సక్సేనా అన్నారు. డెలివరీ నెట్‌వర్క్‌ సృష్టించడంలో అతిపెద్ద సవాల్‌గా నిలిచే అంశం, తమ కమ్యూనిటీలను బాగా అర్ధం చేసుకునే అసాధారణ బృందాలను నిర్మించడం , దానిని అత్యుత్తమంగా తీర్చిదిద్దే చిరు వ్యాపార యజయానులు అభివృద్ధి చేయడం. వీరు తమ కమ్యూనిటీలను అన్వేషించడం ద్వారా అత్యుత్తమ అసోసియేట్లను నియమించుకోవడంతో పాటుగా అభివృద్ధి చేయనున్నారు. అదే సమయంలో, డీఎస్‌పీ ప్రోగ్రామ్‌ వారికి స్థిరమైన వాల్యూమ్‌, లాజిస్టిక్‌ అనుభవం, సాంకేతికత, అనుకూల వనరులతో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందడానికి సహాయపడుతుంది. అమెజాన్‌ తమ డీఎస్‌పీ ప్రోగ్రామ్‌ ఆరంభించిన నాటి నుంచి, డీఎస్‌పీల కోసం నూతన ఎక్స్‌క్లూజివ్స్‌తో ఇది అంతర్జాతీయంగా 1 బిలియన్‌ డాలర్లను పెట్టుబడులను పెట్టింది. ఈ పెట్టుబడుల కారణంగా, 2500 చిన్న లాజిస్టిక్‌ కంపెనీలు వృద్ధి చెందడంతో పాటుగా అంతర్జాతీయంగా డీఏల కోసం లక్షలాది ఉద్యోగాలను సృష్టించడమూ జరిగింది. దేశంలో మొట్టమొదటిసారిగా డీఎస్‌పీ కార్యక్రమం ఆరంభించిన నాటి నుంచి, ఎస్‌ఎంబీలకు వృద్ధి అవకాశాలను అందించడంలో అమెజాన్‌కు ఇది తోడ్పడటంతో పాటుగా భారతదేశపు మారుమూల ప్రాంతాలను సైతం చేరుకునేందుకు తోడ్పడుతుంది.
ఈ ప్రోగ్రామ్‌లో భారతదేశ వ్యాప్తంగా 300 మందికి పైగా వ్యాపారవేత్తలు భాగమై ఉండటంతో పాటుగా 750 నగరాలు, పట్టణాలలో 1500 కు పైడా డెలివరీ సర్వీస్‌ పార్టనర్‌ స్టేషన్స్‌ నిర్వహిస్తూ లక్షలాది ఉద్యోగాలను స్థానికుల కోసం సృష్టిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇప్పటికే అమెజాన్‌ ఇండియా తమ మొదటి బ్యాచ్‌ వ్యవస్థాపకులతో చేతులతో కలుపడంతో పాటుగా ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. తద్వారా వారు విభిన్న ప్రాంతాలలో తమ కార్యకలాపాలను ప్రారంభించవచ్చు. మరింతగా తెలుసుకునేందుకు లేదా నేడు ప్రారంభించేందుకు వెబ్‌సైట్‌ను చూడవచ్చునని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img