Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

మరోసారి కోహ్లికి స్వర్ణయుగం: భట్‌

న్యూదిల్లీ: భారత బ్యాటర్‌ కింగ్‌ కోహ్లి కెరీర్‌లో మరోసారి స్వర్ణ యుగం రానుందని పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ అభిప్రాయపడ్డాడు. శ్రీలంక స్టార్‌ ఆటగాడు సంగక్కర కెరీర్‌ లాగే విరాట్‌ భవిష్యత్తు కూడా ఉండనుందని జోస్యం చె ప్పాడు. భట్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ ‘భవి ష్యత్తులో విరాట్‌ అత్యుత్తమ ఆట మరోసారి కనువిందు చేయనుంది. ఇప్పటికే స్వేచ్ఛగా ఆడు తున్నాడు. ఇంకా అతడి స్థాయి ఆటను అందు కోలేదు. అతడి కెరీర్‌లోని స్వర్ణయుగంలో అన్‌స్టా పబుల్‌ మాదిరిగా ఆడాడు. మీరు కుమార సంగక్కర కెరీర్‌ను చూడండి. అతడు కెరీర్‌ చివరి రోజుల్లో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాడు. కానీ, కుర్రాడిగా ఉన్నప్పుడు అంత గొప్పగా ఆడలేకపోయాడు. చాలామంది ఆటగాళ్ల కెరీర్‌లో ఇది చోటు చేసుకొంది’’ అని విశ్లేషించాడు. ‘ఆధునిక క్రికెట్‌లో మ్యాచ్‌ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మోతాదుకు మించిన మ్యాచ్‌లు ఆటగాడిపై ప్రభావం చూపిస్తాయి. తెలివైన ఆటగాళ్లు వారికి సరిపడా ఫార్మాట్‌ను ఎంచుకొని దానిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. ఒక్కసారి ఆ పనిచేస్తే.. అతడి ఆట అదే స్థాయిలో కొనసాగు తుంది. భవిష్యత్తుపై నిర్ణయం తీసుకో వాల్సింది కోహ్లినే. అతడి కెరీర్‌లో మరోసారి స్వర్ణయుగం వస్తుందనుకొంటున్నా’’ అని సల్మాన్‌ భట్‌ సూచించాడు. గతేడాది ఆసియాకప్‌ ముందు వరకు శతకం కోసం కోహ్లి సుదీర్ఘ సమయం నిరీక్షించాల్సి వచ్చింది. ఆసియాకప్‌లో అఫ్గానిస్థాన్‌పై 122 పరుగులు చేసిన తర్వాత అతడి ఆటతీరు ఒక్కసారిగా మారిపోయింది. మునుపటి లయను అంది పుచ్చుకొని పరుగుల వరదను పారించాడు. మూడు వన్డే శతకాలు నమోదు చేశాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img