Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

మరో మూడు పతకాలు

హైజంప్‌లో మరియప్పన్‌కు సిల్వర్‌ శరద్‌కుమార్‌కు కాంస్యం
షూటింగ్‌లో సింగ్‌రాజ్‌ అధానకు కాంస్యం

టోక్యో: పారాలింపిక్స్‌లో భారత్‌ పతకాల వేట దిగ్విజయంగా కొనసాగు తోంది. బరిలోకి దిగిన ప్రతీ ఈవెంట్‌లో పతకాలను సాధిస్తూ.. మన పారా అథ్లెట్లు ఎదురులేకుండా దూసుకుపోతున్నారు. సోమవారం ఒక్కరోజే ఐదు పతకాలతో(రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, ఓ కాంస్యం)తో మెరవగా.. మంగళవారం అదే జోరును కొనసాగించారు. భారత షూటర్‌ సింగ్‌రాజ్‌ అధాన కాంస్యపతకం అందించగా.. తాజాగా పురుషుల హైజంప్‌లో మరియప్పన్‌ తంగవేలు సిల్వర్‌ మెడల్‌తో మెరవగా.. శరద్‌ కుమార్‌ బ్రాంజ్‌ మెడల్‌ సాధించాడు. దాంతో భారత్‌ పతకాల సంఖ్య పదికి చేరింది. మంగళవారం జరిగిన పురుషుల టీ42 హైజంప్‌ కేటగిరిలో మరియప్పన్‌ తంగవేలు 1.86 మీటర్ల ఎత్తు దూకి రెండో స్థానంలో నిలిచాడు. 1.88 మీటర్ల ఎత్తును క్లియర్‌ చేసిన అమెరికా అథ్లెట్‌ సామ్‌ గ్రూ స్వర్ణం పతకం చేజిక్కించుకోగా.. 1.83 మీటర్లతో శరద్‌ కుమార్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్యపతకం అందుకున్నాడు. 2016 రియో పారాలింపిక్స్‌లో తంగవేలు స్వర్ణంతో తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. 1.88 మీటర్ల ఎత్తును క్లియర్‌ చేయడంలో మూడు ప్రయత్నాల్లో తలపడగా.. గోల్డ్‌ మెడ లిస్ట్‌ సామ్‌ మూడో ప్రయత్నంలో క్లియర్‌ చేశాడు. ఇక రియో ఒలింపిక్స్‌లో 6వ స్థానంలో నిలిచిన శరద్‌ కుమార్‌ ఈసారి మెరుగైన ప్రదర్శనతో కాంస్యం అందుకున్నాడు. ప్రారంభం నుంచే శరద్‌ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 1.73, 1.77, 1.80 మీటర్ల ఎత్తును తొలి ప్రయత్నాల్లోనే క్లియర్‌ చేశాడు. ఈ క్రమంలో కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫామెన్స్‌ కనబర్చాడు. రియో గోల్డ్‌ మెడలిస్ట్‌ తంగవేలు సైతం 1.80, 1.83, 1.86 మీట తొలి ప్రయత్నంలోనే అధిగమించాడు. కానీ 1.88 మీట్లను క్లియర్‌ చేయలేకపోయాడు. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న మరో భారత ప్లేయర్‌ వరుణ శింగ్‌ భాటీ 1.73 మీటర్లను అధిగమించలేక ఏడో స్థానంలో నిలిచాడు. కాగా, వీరిద్దరి ప్రదర్శనను మెచ్చుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్‌లో అభినందించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఎస్‌హెచ్‌`1 విభాగంలో సింగ్‌రాజ్‌ అధానా 216.8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. భారత్‌ తరపున పాల్గొన్న మరో షూటర్‌ మనీశ్‌ అగర్వాల్‌ ఫైనల్స్‌లో ఏడో స్థానంతో సరిపెట్టుకొన్నారు. దీంతో పారాలింపిక్స్‌లో భారత్‌ సాధించిన పతకాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. ఈ పోటీల్లో చైనా క్రీడాకారుడు డిఫెడిరగ్‌ ఛాంపియన్‌ చావో యాంగ్‌ (237.9 ) పారాలింపిక్‌ రికార్డు సృష్టించి స్వర్ణం సాధించగా, మరో చైనా క్రీడాకారుడు హువాంగ్‌ జింగ్‌ (237.5) రజతం అందుకున్నాడు. షూటింగ్‌లో కాంస్య పతకం సాధించిన సింగ్‌రాజ్‌ అధానాకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img