Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

యువరాజ్‌ సింగ్‌ దాతృత్వం

హైదరాబాద్‌ : అంతర్జాతీయ కెట్‌ ఐకాన్‌ యువరాజ్‌ సింగ్‌ నిర్వహిస్తున్న యువీకాన్‌ ఫౌండేషన్‌ తన మిషన్‌ 1000 బెడ్స్‌ లక్ష్యంలో భాగంగా, ప్రముఖ సాఫ్త్‌వేర్‌ సంస్థ యాక్సెంచర్‌ అందించిన ఆర్థిక సహాయంతో తెలంగాణలోని నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ అండ్‌ జనరల్‌ హాస్పిటల్‌లో 120 క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (సిసియు) పడకలను ఏర్పాటు చేసింది. యాక్సెంచర్‌ అందించిన నిధులను యువీకాన్‌ ఫౌండేషన్‌ బైపాప్‌ యంత్రాలు, ఐసియు వెంటిలేటర్లు, రోగి మానిటర్లు, ఆక్సిజన్‌ సిలిండర్లు వంటి వివిధ వైద్య పరికరాలను కూడా హాస్పిటల్‌కు అందించడానికి ఉపయోగించింది. ఈ సౌకర్యాన్ని యువరాజ్‌ సింగ్‌ బుధవారం తెలంగాణ హోం మంత్రి మహమూద్‌ అలీ, యాక్సెంచర్‌, హాస్పిటల్‌ ప్రతినిధుల సమక్షంలో వర్చువల్‌గా ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img