Friday, April 19, 2024
Friday, April 19, 2024

యువ సంచలనం వెంకటేశ్‌ అయ్యర్‌

హైదరాబాద్‌ : కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ యువ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌.. నిన్నటివరకు ఇతడి గురించి పెద్దగా ఎవరికీ తెలియక పోవచ్చు.. కానీ సోమవారం రాత్రి అబుదాబీలో కోల్‌కతా-బెంగళూరు మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఐపీఎల్‌-14 తొలి దశలో గిల్‌కు తోడుగా నితీశ్‌ రాణాను ఓపెనర్‌గా పంపిన ఆ జట్టు.. రెండో దశలో అనూ హ్యంగా ఈ కొత్త బ్యాట్స్‌మెన్‌కు అవకాశం ఇచ్చింది. ఆడిన తొలి మ్యాచ్‌లోనే అనుభ వజ్ఞులైన బెంగళూరు బౌలర్లను సమర్థవం తంగా ఎదుర్కొని ఆశ్చర్యపరిచాడు. అయ్యర్‌ ఐపీఎల్‌ ఆరంభానికి ముందు విజయ్‌ హజారే టోర్నీలో సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. మధ్య ప్రదేశ్‌ తరఫున ఓపెనింగ్‌ చేసి పంజాబ్‌పై 146 బంతుల్లో 198 పరుగులు చేశాడు. దాంతో కోల్‌కతా దృష్టిలో పడి ఇప్పుడు బెంగళూరుపై రాణించాడు. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్‌గిల్‌ (48 34 బం తుల్లో ..6I4, 1I6) పరు గులు చేయగా వెంకటేశ్‌ (4127 బంతుల్లో 7I4, 1I6) చివరి వరకూ క్రీజులో నిలి చాడు. వెంకటేశ్‌ బ్యాటింగ్‌ ఒక్కటే కాకుండా మీడియం పేసర్‌ కూడా. అతడిని సరైన విధంగా తయారు చేస్తే టీమిండియాకు మరో పేస్‌ ఆల్‌రౌండర్‌ దొరికినట్లే అని క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img