Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్‌లో జకోవిచ్‌

న్యూయార్క్‌ : ప్రపంచ నంబర్‌ వన్‌ టెన్నిస్‌ ఆటగాడు నొవాక్‌ జకోవిచ్‌ యూఎస్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ`2021 ఫైనల్‌లో ప్రవేశించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో నాలుగో సీడ్‌ జర్మన్‌ ఆటగాడు అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌పై 4-6, 6-2, 6-4,6-2 తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం(సెప్టెంబరు 12) రెండో సీడ్‌ ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌(జర్మనీ)తో జరిగే ఫైనల్‌ పోరులో జకోవిచ్‌ పోటీ పడనున్నాడు. ఆర్థర్‌ ఆషే స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది.
ఈ టైటిల్‌ గెలిస్తే..
జకోవిచ్‌ ఈ టైటిల్‌ గెలిస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సొంతం చేసుకున్న టెన్నిస్‌ ఆటగాడిగా జకోవిచ్‌ చరిత్ర సృష్టించినట్లవుతుంది. దీంతో పాటు 52 ఏళ్ల తర్వాత పురుషుల సింగిల్స్‌ క్యాలెండర్‌ ఇయర్‌ గ్రాండ్స్‌ స్లామ్స్‌ గెలిచిన ఆటగాడిగా నిలువనున్నాడు. గతంలో 1969లో రాడ్‌ లావెర్‌ క్యాలెండర్‌ ఇయర్‌ గ్రాండ్‌ స్లామ్స్‌ గెలిచి రికార్డు సృష్టించాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img